Take a fresh look at your lifestyle.

మాస్క్ ‌పెట్టుకోకుంటే రూ.500జరిమాన

  • వచ్చే మూడు వారాలు ధాన్యం కొనుగోలు మినహా…
  • అధికారులకు మిగతా పనులు బంద్‌
  • ‌నేటి నుంచి జిల్లాలో 666బృందాల ద్వారా కోవిడ్‌ ‌ఫీవర్‌ ఇం‌టింటి సర్వే
  • టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు వెల్లడి
  • బాలల సహాయవాణి పోస్టర్‌ ఆవిష్కరణ

సిద్ధిపేట, మే 7 (ప్రజాతంత్ర బ్యూరో): కొరోనా మహమ్మారి ఉధృతమవుతుండటంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధ్యతలను విస్మరిస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా సరే అందరిపైనా కఠిన చర్యలు ఉంటాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. సిద్ధిపేట జిల్లాలో శనివారం నుంచి నిర్వహించే ఇంటింటా కోవిడ్‌ ‌ఫీవర్‌ ‌సర్వేపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, పార్లమెంట్‌ ‌సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి.వెంకట్రామరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌, ‌జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌నుండి జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులలతో టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..గ్రామ స్థాయిలో కోవిడ్‌ ‌నియంత్రణకు నిర్వహించే ఇంటింటా కోవిడ్‌ ‌ఫీవర్‌ ‌సర్వేను నిర్వహిస్తున్నామనీ, జిల్లా వ్యాప్తంగా  666 బృందాల ద్వారా ఇంటింటా కోవిడ్‌ ‌ఫీవర్‌ ‌సర్వేను చేపట్టనున్నట్లు తెలిపారు.  ప్రతి రోజూ సాయంత్రం సర్వే బృందాల పని తీరును నాతో పాటు జిల్లా యంత్రాంగం మానిటరింగ్‌ ‌చేస్తుందనీ,  స్థానిక సర్పంచి, వార్డు మెంబర్‌, ‌కార్యదర్శి, ఏఎన్‌ఎం, అం‌గన్‌వాడీ, ఆశా, వివోఏతో బృందాలు పాల్గొంటాయన్నారు.  సర్వేలో కొరోనా వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వం అందించే మెడికల్‌ ‌కిట్స్‌ను వెంటనే ఇవ్వాలన్నారు.  కొరోనా నేపథ్యంలో  వచ్చే 3 వారాలు ధాన్యం కొనుగోలు మినహా అధికారులకు  మిగతా పనులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ  సాముహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలనీ,  తప్పనిసరయితే కేవలం 100 మందికే పరిమితం కావాలన్నారు.

ఆక్సిజన్‌ ‌లెవెల్‌ 94 ‌శాతం కంటే తక్కువ ఉంటే 108 ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ ‌కేంద్రాలకు తీసుకురావాలనీ,  ప్రారంభంలోనే వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందిస్తే వ్యాధి నుంచి బయట పడొచ్చన్నారు.  మాస్క్ ‌ధరించనీ వ్యక్తులకు 500రూపాయల జరిమానా విధిం చాలన్నారు. కొరోనాను అరికట్టడంలో సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్‌రావు సూచించారు. అనంతరం కోవిడ్‌ ‌విపత్తుల బాలల సహాయ వాణి పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Leave a Reply