Take a fresh look at your lifestyle.

‘’సెల్‌ ‌ఫోన్‌ ‌మాయాజాలంలో.. మసకబారుతున్న బాల్యం’’

“సెల్‌ ‌ఫోన్‌ అదేపనిగా విరామం లేకుండా వాడటం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం, డిప్రెషన్‌కు లోనుకావడం. అవసరమైన విషయాల పై నిరాసక్తత కనబరచడం, అర్థం లేకుండా భయపడడం, అతిగా ఆలోచించడం, చేపట్టిన పనులను సరిగా చేయలేక పోవడం, ఊబకాయం రావడం, ఫోన్‌ ‌లో గంటల తరబడి మాట్లాడుతుంటే క్యాన్సర్‌ ‌కొని తెచ్చుకోవడమే నని మొబైల్‌ ‌ఫోన్లు పదేళ్లుగా వాడే యువతకు క్యాన్సర్‌ ‌వచ్చే అవకాశాలు ఎక్కువ అని స్వీడన్‌ ‌కు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.పాలు త్రాగే వయసున్న పసిపిల్లలు సైతం సెల్‌ ఇస్తే, చూపిస్తేనే పాలు తాగడం, తినే సమయంలో కూడా ఒక చేత్తో మొబైల్‌ ‌వాడకం జరుగుతున్నాయి.”

మానవ నాగరికతా పరిణామ క్రమంలో సుఖమయ జీవితం కోసం మానవుడు ప్రకృతికి ఎదురీదుతూ, అభివృద్ధి కోసం ఎన్నో నూతన ఆవిష్కరణలు చేయడం జరిగింది.ఈ శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలను గావిస్తూ ఆ పరిశోధన ఫలాలతో ఆనందమైన జీవితం కోసం ప్రశాంతంగా, హాయిగా జీవించే ప్రయత్నం కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలోనే సమాచార చేరవేత కు సెల్ఫోన్‌ ‌కనుగొనడం జరిగింది. మొదట అతి ముఖ్యమైన పనుల కోసం ధనవంతులు మాత్రమే వాటిని ఉపయోగించేవారు .ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నవిగా ఉండేవి. సమాచార విప్లవంతో చౌకగా మారి సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చింది. మొదట విలాసవంతంగా ఉన్న వస్తువు,శాస్త్ర సాంకేతిక సమాచార విప్లవంతో మధ్యతరగతి, వారికి దిగువ తరగతి వారికి కూడా అందుబాటులోకి వినిమయ సంస్కృతి తీసుకొచ్చింది.ఈరోజు కూడు,గూడూ, గుడ్డ వంటి కనీస అవసరాలు ఎంత ముఖ్యమో సెల్‌ ‌ఫోన్‌ ‌కూడా అంతే ముఖ్యమైన అవసరంగా సామాన్యుల ఇంటిలోకి చొరబడింది.మానవ మస్తిష్కం లను పాడుచేస్తుంది.

ప్రస్తుత సమాజంలో ఒక తప్పనిసరి సాధనం .ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరికి సెల్‌ ‌ఫోన్‌ ఉం‌ది. పసిపిల్ల వాళ్ల దగ్గర నుండి పండు ముదుసలి వరకు సెల్‌ ‌ఫోన్‌ ‌వాడుతున్నారు. ఈరోజు ప్రపంచంలో ప్రస్తుతం స్మార్ట్ ‌ఫోన్‌ ‌మరియు ఫీచర్‌ ‌ఫోన్‌తో సహా ప్రస్తుత మొబైల్‌ ‌వినియోగదారుల సంఖ్య 4.88 బిలియన్లు అంటే ప్రపంచ జనాభాలో 62.07%మంది ఫోన్‌ ‌కలిగి ఉన్నారు .భారతదేశంలో స్మార్ట్ ‌ఫోన్‌ ‌వినియోగదారుల సంఖ్య 2021లో 760 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది..మొబైల్స్ ‌వల్ల తక్షణమే సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది .దీని వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్న మితిమీరి వాడకం వల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో జీవితాలను కోల్పోయేలా చేస్తున్నాయి. యువత ,విద్యార్థులు మరియు చిన్న పిల్లలు బానిసలుగా మారి గంటలకొద్దీ అదేపనిగా సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు .దీనివల్ల అనేక అనర్ధాలు వాటిల్లుతున్నయని మానసిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు .చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సెల్‌ ‌ఫోన్ల కు బానిసలుగా మారారని, తమ మాట వినడం లేదని, వారి పరిస్థితి భయానకంగా తయారైంది అని ఆందోళన పడుతున్నారు . ఏ మాత్రం సమయం దొరికినా సెల్‌ ‌ఫోన్‌లో నిమగ్నమవుతున్నారు అని అంటున్నారు.

దీనికితోడు గత 18 నెలల నుండి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి విశ్వరూపంతో లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా భౌతిక దూరాన్ని పాటించే నెపంతో ఇంటి నుండి బయటకు అడుగు పెట్టకుండా ఉండాల్సి రావడం, గది నాలుగు గోడల మధ్య కాలయాపన చేయాల్సి రావడంతో మొబైల్‌ ‌ఫోన్‌ ‌వాడకం గతంలో కంటే ఎక్కువ అయింది. ముఖ్యంగా విద్యాసంస్థలు మూతపడడంతో ప్రత్యక్ష విద్యా బోధనకు అవకాశం లేకపోవడంతో ఆన్లైన్‌ ‌విద్య ప్రవేశపెట్టడంతో సెల్‌ ‌ఫోన్‌ ‌వాడటం అధికమై విద్యార్థులు అనేక మంది సెల్‌ ‌ఫోన్‌ ‌మత్తులో , మాయాజాలంలో పడి మానసిక రుగ్మతలతో కొంతమంది, ప్రేమ వ్యవహారాలతో కొంతమంది ముఖ్యంగా బాలికలు, సైబర్‌ ‌నేరాలకు గురికావడం, పాల్పడడం తో కేసుల పాలవ్వడం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం లాంటి సంఘటనల వల్ల ఎందరో విద్యార్థులు మరియు యువత పెడదారి పట్టడంతో వారి తల్లిదండ్రులు మరియు సమాజం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ మధ్యకాలంలో జరిగిన సెల్‌ ‌ఫోన్‌ అనర్ధాలు మచ్చుకు కొన్నింటిని పరిశీలిద్దాం… వరంగల్‌ ‌జిల్లా లోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి బాలిక కు ఆన్‌లైన్‌ ‌తరగతుల కోసం, వారి తండ్రి సెల్‌ఫోన్‌ ‌కొనిచ్చాడు. ఆ బాలిక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ‌క్రియేట్‌ ‌చేసుకొని మిత్రులతో చాటింగ్‌ ‌చేసేది.

ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పరిచయమై, మాయమాటలు చెప్పి అభం శుభం తెలియని ఆ బాలికను ట్రాప్‌ ‌చేయడంతో,.ఆ బాలిక గడప దాటి వెళ్లడంతో తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.. అదే విధంగా మహబూబాబాద్‌ ‌జిల్లా లోని ఒక మండలానికి చెందిన తొమ్మిదో తరగతి బాలునికి ఆన్‌లైన్‌ ‌తరగతులు వీక్షించడానికి సెల్‌ ‌ఫోన్‌ ‌కొనివ్వగా , ఆ బాలుడు ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌తో… ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు రెండు లక్షల రూపాయలు తండ్రి అకౌంట్‌ ‌నుండి పోగొట్టటం జరిగింది. అదే విధంగా మరో జిల్లాలో వీడియో గేమ్‌ ‌లకు బానిసగా మారిన ఓ విద్యార్థి మానసిక రుగ్మతలతో హాస్పిటల్‌ ‌లో చేరడం.. లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నవి. ఇలా చాలామంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇక్కట్ల పాలవుతున్నరు. ఆన్‌లైన్‌ ‌తరగతులను వీక్షించే పేరిట గంటల తరబడి సెల్‌ ‌ఫోన్‌ ‌తో కాలక్షేపం చేస్తూ అశ్లీల దృశ్యాలు మరియు వీడియో గేమ్స్ ‌లకు అలవాటుపడి వేళాపాళా లేకుండా తిండి, నీరు,నిద్ర లేకుండా అదేపనిగా వ్యసనంగా మారడంతో మానసిక రుగ్మతలకు గురికావడంతో కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన విషాదకర సంఘటనలు జరుగుతుండడం విచారకరం.

వీటికి తోడు యువత, విద్యార్థులు సెల్ఫీలు దిగేపేరిట ప్రమాదాలకు గురై తమ అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకొని వారి కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. అంతేకాకుండా అధికంగా సెల్‌ఫో•న్‌ ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. సెల్‌ ‌ఫోన్‌ అతిగా వాడడం వల్ల వచ్చే నష్టాలు: సెల్‌ ‌ఫోన్‌ అదేపనిగా విరామం లేకుండా వాడటం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం, డిప్రెషన్‌కు లోనుకావడం. అవసరమైన విషయాల పై నిరాసక్తత కనబరచడం, అర్థం లేకుండా భయపడడం, అతిగా ఆలోచించడం, చేపట్టిన పనులను సరిగా చేయలేక పోవడం, ఊబకాయం రావడం, ఫోన్‌ ‌లో గంటల తరబడి మాట్లాడుతుంటే క్యాన్సర్‌ ‌కొని తెచ్చుకోవడమే నని మొబైల్‌ ‌ఫోన్లు పదేళ్లుగా వాడే యువతకు క్యాన్సర్‌ ‌వచ్చే అవకాశాలు ఎక్కువ అని స్వీడన్‌ ‌కు చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.పాలు త్రాగే వయసున్న పసిపిల్లలు సైతం సెల్‌ ఇస్తే, చూపిస్తే నే పాలు తాగడం, తినే సమయంలో కూడా ఒక చేత్తో మొబైల్‌ ‌వాడకం జరుగుతున్నాయి.

పిల్లలు, యువత సెల్‌ ‌ఫోన్‌ ‌వాడకాన్ని అదుపులో ఉంచేందుకు సమాజం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.చిన్న పిల్లలకు సెల్‌ ‌ఫోన్‌ ‌దూరంగా ఉంచాలి.అవసరం ఉన్న సమయంలోనే సెల్‌ అం‌దుబాటులో ఉంచాలి. సోషల్‌ ‌మీడియా లో అకౌంట్‌ ‌లేకుండా ,అనవసర చాటింగులు, అక్కరకు రాని వీడియోలు చూడకుండా దూరంగా ఉంచాలి.వారిని నిత్యం పర్యవేక్షిస్తూ, కౌన్సిలింగ్‌ ‌చేస్తూ ఉండాలి.సెల్‌ ‌ఫోన్‌ ‌పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎక్కువగా వాడటం మంచిది కాదు .వీటన్నిటినీ దూరంగా పెట్టి కుటుంబంతో సమయం గడిపితే చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్‌ ‌గ్యాడ్జెట్స్‌కు కాకుండా మనసులకు విలువ ఇవ్వాలి. పెద్దవాళ్ల ప్రవర్తనను బట్టి పిల్లలు అనుసరించడం జరుగుతుంది.

కనుక పెద్దవాళ్లు సెల్‌ ‌ఫోన్లు వాడటం తగ్గించాలి. పిల్లలకు ఆదర్శంగా నిలవాలి.ఏ వస్తువైనా అవసరానికి మించి వాడటం మంచిది కాదు. అవసరం ఉన్నంత మేరకు వాడాలి.అప్పుడే శ్రేయస్కరం. మైనర్ల లో స్మార్ట్ ‌ఫోన్‌ ‌వాడకం పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ‌పరిశోధన ప్రకారం 10 ఏళ్ల వయసు పిల్లలకు 37.8 శాతం ఫేస్‌బుక్‌ అకౌంట్‌, 24.3 ‌శాతాన్ని ఇంస్టాగ్రామ్‌ ‌ఖాతాలు ఉన్నట్లు వెల్లడయింది. వాస్తవానికి పదమూడేళ్ల వయస్సు ఉన్న వారికి మాత్రమే సోషల్‌ ‌మీడియా అకౌంట్‌ ఉం‌డాలి. నిద్రపోయే ముందు 76.2 0% ఫోన్‌ ‌వాడుతున్నారని, 23.8 శాతం బెడ్‌ ఎక్కాక కూడా ఫోన్‌ ‌వాడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నా నేపథ్యంలో ఈ పరిశోధన ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కనుక ఫోన్‌ ‌వాడకాన్ని తగ్గించుటకు తల్లిదండ్రులు, సమాజమూ ,స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply