Take a fresh look at your lifestyle.

తెలంగాణ విశ్వవిద్యాలయం లో అర్ధరాత్రి అక్రమంగా చేరిన అధ్యాపకులను వెంటనే తొలగించాలి

విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్

లంగాణ యూనివర్సిటీ లో 2014 సంవత్సరంలో భర్తీ చేసిన రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు అక్రమంగా అర్ధరాత్రి దొంగచాటున వచ్చి చేరారని వారిని వెంటనే తొలగించాలని పూర్వ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లో పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ 2012 సంవత్సరంలో యూనివర్సిటీ రెగ్యులర్ ప్రొఫెసర్, అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని ఇంటర్వ్యూ అర్హులైన వారికి కాకుండా అనర్హులను కాల్ లెటర్ పంపించారని యూనివర్సిటీలో కొందరు అర్హులైన అకాడమిక్ కన్సల్టెంట్లు (AC లు) కోర్టుకు వెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. ఈ రిక్రూట్మెంట్ మొత్తం తప్పుల తడకగా సాగిందని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు రిజర్వేషన్లు పాటించలేదని ఆయన అన్నారు.
చాలా మంది అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ లు ఉన్నా, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, ఈ నియామకాలపై ప్రభుత్వం విచారణ జరిపించి  ద్విసభ్య కమిటీని వేయడం జరిగిందని, ఈ  ద్విసభ్య కమిటీ కూడా నియామకాలలో అక్రమాలు జరిగాయని నియామకాలు చెల్లవని నివేదిక ఇచ్చారని మరియు ప్రస్తుత లోకాయుక్త చైర్మన్ సివి రాములు సార్ కమిటీ కూడా అక్రమ నియామకాలు జరిగాయని నివేదిక ఇచ్చారని అని ఆయన అన్నారు. అప్పటి యూనివర్సిటీ అధికారులు కోర్టులో కేసు వేసినా వారిని మచ్చిక చేసుకొని కేసు వేసిన దాని నుండి తప్పించారని కేసు వేసిన కొందరిని ఉద్యోగాలను తొలగిస్తామని బెదిరించి  కేసును వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేశారని, నియామకాలపై తెచ్చిన కోర్టు స్టే తొలగించేలా చేశారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా వేకువజామున 3 గంటలకు ఉద్యోగాల్లో చేరిన అధ్యాపకులు కేవలం మన తెలంగాణ యూనివర్సిటీ లో అక్రమంగా నియమించబడ్డ ఆ అధ్యాపకులేనని ఆయన ఎద్దేవా చేశారు. అక్రమంగా చేరిన అధ్యాపకులను వెంటనే తొలగించాలని ఆయన ఈ విలేకరుల సమావేశంలో డిమాండ్  చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ ,కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ,విద్యార్థి నాయకులు సతీష్ ,సంపత్ అలీఖాన్, సాయిరాం ,సురేష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply