Take a fresh look at your lifestyle.

సరికొత్త సవాళ్లు ఎదుర్కొంటున్న .. కార్మికవర్గం

మేడే అనగానే గుర్తుకు వచ్చేది కార్మిక వర్గమే. ఇప్పుడా రంగం కొరోనా కారణంగా రోడ్డున పడింది. ఇది ఏ ఒక్క దేశ పరిస్థితో కాదు. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక రంగం రోడ్డున పడింది. కార్మికులు పనులు లేకుండా ఇంటికే పరిమితం కావడం బహుశా ఈ మేడే ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మేడే ఉత్సవాలు ప్రప్రథమంగా బోసిపోతున్నాయి. ఎక్కడా ఉత్సవాలకు అవకాశం లేకుండా పోయింది. కొరోనా అనంతర చర్యల్లో ప్రథమ ప్రాధాన్యం కార్మిక వర్గానిదే. మరోమారు వారు పూనుకోకుంటే బతుకు చక్రం నడవదని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి.

ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించుకున్నా.. నేటికీ అవి అమలు కావడం లేదు. కొరోనా కారణంగా ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు కూడా ఉంటాయో ఊడుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. కార్మికులు తమ స్వేదాన్ని రక్తంగా చిందించి లాభాలు తెచ్చి పెడుతున్నా, నేటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదు. పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. తమ డిమాండ్లపై నినదించిన వారిని తక్షణం ఉద్యోగాల నుంచి తొలగస్తున్నారు. విద్యా,ఉద్యోగ సౌకర్యాల కల్పన లేదు. వారికి ఆరోగ్య సమస్యలపై పెద్దగా స్పందించడం లేదు. అలాగే అర్థాంతరంగా కంపెనీలను, సంస్థలను మూసేసి కార్మికలు నోట్లో మట్టి కొడుతున్నారు. నేటికీ ఇంకా ఫ్యూడల్‌ ‌భావాల నుంచి యాజమాన్యాలు బయటపడడం లేదు. కొరోనా నేపథ్యంలో మేడే వేడుకలకు కార్మిక వర్గ•ం దూరంగా ఉంటోంది. వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రపంచ దేశాలపై ఉంది.

Leave a Reply