Take a fresh look at your lifestyle.

సారూ.. మా ధాన్యం కొనరూ..!

పంట చేతికొచ్చి నెలరోజులు కావసు్త న్నా ఇంత వరకు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని మండలంలోని అడవికేశవాపురం గ్రామానికి చెందిన రైతు ఆర్డీవో మధుమోహన్‌ ‌కాళ్లమీదపడి వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామంటున్న తరుణంలో మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు.

ఆర్డీవోను రైతు బ్రతిమిలాడుతున్న సమయంలో బీజేపి జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ అధ్యక్షుడు కేవీఎల్‌ఎన్‌ ‌రెడ్డి, కౌన్సిలర్‌ ‌బొట్ల శ్రీనివాస్‌, ‌నాయకులు చౌడ రమేష్‌, ఉడుగుల రమేష్‌, ‌క్రాంతి, మహిపాల్‌, ‌శివరాజ్‌ ‌యాదవ్‌, ‌తదితరులున్నారు. వెంటనే స్పందించిన ఆర్డీవో ఆ గ్రామంలో ఉన్న పీఏసీఎస్‌ ‌కేంద్రాన్ని సందర్శించి వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని లేనియెడల మిల్లర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!