Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలపై.. నేడు కేబినేట్‌ ‌భేటీ

  • అయినా పెరుగుతున్న కేసుల సంఖ్య
  • లాక్‌డౌన్‌ ‌పొడిగింపుతో ఆర్థికంగా దివాళ
  • తదుపరి చర్యలపై సీఎం కెసిఆర్‌ ‌తర్జనభర్జన
  • మద్యం విక్రయాలను అనుమతిస్తారా?

రాష్ట్రంలో కొరోనా నివారణ చర్యలను తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా మళ్లీ కరోనా కేసుల పెరుగుతుండడం
ఆందోళన కలిగిస్తోంది. నిజానికి లాక్‌డౌన్‌ 3‌తో ముగియనున్న దశలో దానిని 7వరకు పొడిస్తూ సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు. ఈ మేరకు కేబినేట్‌లో చర్చించి ఆమోందించారు. పరిస్థితిని సక్షించి మళ్లీ 5న జరిగే కేబినేట్‌ ‌సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కెసిఆర్‌ ‌ప్రకటించారు. అప్పిటికీ ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులు రాలేదు. సరికదా రెడ్‌జోన్ల సంఖ్య పెరగింది. ప్రతిరోజూ సిఎం పరిస్థితిని సక్షిస్తున్నారు. ఈ లోగా లాక్‌డౌన్‌ను కేంద్రం 17వరకు పొడించింది. అలాగే కొన్ని సడలింపులు ఇచ్చింది. తెలంగాణ సర్కార్‌ 7‌వరకు పెట్టిన గడువును మించి 17 వరకు పొడిగించారు. ఈ దశలో తదుపరి చర్యలపై కేబినేట్‌ ‌చర్చించాల్సి ఉంది. మంగళవారం సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన జరిగే కేబినేట్‌ ‌దీనిపై చర్చించనుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలన్నదానిపై చర్చిస్తారు. అలాగే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు. కాగా రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం వరకు కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు అనిపించినప్పటికీ గత రెండు, మూడు రోజులుగా మళ్లీ కొత్త కేసులు వెలుగు చూస్తుండడం పట్ల సిఎం కెసిఆర్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1082కు చేరుకున్నారు. కరోనా వైరస్‌ ‌కారణంగా మొత్తం రాష్ట్రంలో 29 మంది చనిపోయారు. ప్రధానంగా జిహెచ్‌ఎం‌సి పెరిధిలోనే కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌ ‌భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు లాక్‌డౌన్‌లో పలు ఆంక్షలు ఇవ్వడమా? లేక పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని యథావిధిగా లాక్‌డౌన్‌ను పొడగించడమా? అన్న అంశంపై సిఎం కెసిఆర్‌ ‌చర్చించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్‌, ‌వికారాబాద్‌, ‌సూర్యాపేట్‌, ‌వరంగల్‌ అర్భన్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌-‌మల్కాజ్‌గిరి జిల్లాలు రెడ్‌ ‌జోన్‌ ‌పరిధిలో ఉండగా, 17 జిల్లాలు ఆరెంజ్‌ ‌జోన్‌, ‌మరో 10 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌జోన్‌లో ఉన్న ప్రాంతాల్లో పలు సడిలింపులను ఇచ్చింది.

దీంతో పలు రాష్ట్రంలో జోరో కేసులు ఉన్న ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతులు ఇచ్చాయి. కాగా మన రాష్ట్రంలో కూడా వైన్స్ ‌షాపులు తెరవాలన్న డిమాండ్‌ ‌ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ప్రధానంగా ఎక్సైజ్‌ ‌శాఖ నుంచే వస్తోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో కేంద్రం సూచించిన విధంగా గ్రీన్‌జోన్ల పరిధిలో మద్యం విక్రయాలను అనుమతులు ఇస్తే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న అంశంపై కూడా లోతుగా సిఎం కెసిఆర్‌ ‌చర్చించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మద్యం విక్రయాలకు అనుమతులు ఇస్తే ఏ విధంగా ఇవ్వాలి? ఎన్ని గంటలకు పాటు అనుమతించాలి? అన్న అంశంపై కూడా అధికారులతో సిఎం చర్చించారు. ఈ అంశాలపై మంగళవారంనాడు జరిగే రాష్ట్ర క్యాబినెట్‌ ‌సమావేశంలో మరోసారి చర్చించి సిఎం కెసిఆర్‌
‌తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న లాక్‌డౌన్‌ ‌పరిస్థితులు, అమలు జరుగుతున్న తీరు, కరోనా నియంత్రణ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తదితర అంశాలపై సిఎం కెసిఆర్‌ ఇప్పటికే అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులగా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ‌విషయంలో ఎలా ముందుకు సాగుదామన్న అంశంపై అధికారులతో సిఎం సుధీర్ఘంగా చర్చించారు. కేంద్రం లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడగిస్తూనే కరోనా కేసులు లేని ప్రాంతాల్లో ఆంక్షలలో పలు సడలింపులను ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజలు పాటు పొడగించడమా? లేక పలు ఆంక్షలతో సడలింపులు ఇవ్వాలా? అన్న అంశఁపై కేబినేట్‌ ‌సమావేశంలో సిఎం లోతుగా చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వలస కార్మికుల తరలింపు, లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఈ నెల 5న కేబినెట్‌ ‌భేటీలో చర్చించనున్నారు.

Leave a Reply