Take a fresh look at your lifestyle.

భారత గణతంత్రానికి, రాజ్యాంగానికి.. హిందువుల్లో తీవ్రవాదంతో పెను ముప్పు

మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో సంపన్నుడైన హిందువు తన ఇంటి పక్కన  సంపన్నుడైన ముస్లిం ఇల్లు కొనుక్కోకుండా అడ్డుకున్న సంఘటన, కల్లోలిత చట్టం కింద కేసు పెట్టడం వంటి  ధోరణులన్నీ హిందూ తీవ్రవాదానికి నిదర్శనాలు. కాశ్మీర్‌లో నెలల తరబడి నాయకులనూ, మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్బంధంలో ఉంచడం, ఒక వర్గం వారిపై ఆంక్షలు విధించడం , అయోధ్యలో ముస్లింలు వ్యతిరేకిస్తున్నా  రామాలయం నిర్మాణానికి సన్నాహాలు  మొదలైనవన్నీ హిందూ   తీవ్రవాదానికి  నిదర్శనాలు. వీరికి మెజారిటీ హిందువుల మద్దతు లేదు.  అలాగే, మెజారిటీ హిందువులకు హిందూ రాజ్య భావనా లేదు.

Extreme threat to terrorism among Hindus
హిందూ రాజ్యమనేది ఊహాజనితమే తప్ప హిందువులు సైతం ఒప్పుకోరు. అలా కాకుంటే ఏం జరుగుతుందో వేచి చూడాలి గత వారం కిషోర్‌ ‌మారియా అండమాన్‌ ‌సముద్రంలో పడవ ప్రయాణం చేసి థాయి లాండ్‌లోని ఫుకెట్‌ ‌తీరానికి వెళ్ళాలనుకున్నారు. ఒక పడవనూ, సరంగును మాట్లాడుకోవా లనుకున్నారు. ఈ పడవలను అద్దె కిచ్చే కంపెనీ ఆఫీసులో ఉద్యోగిని మారియాను మీరు భారత్‌ ‌నుంచి వచ్చారు కదా, మీరు హిందువులా అని అడిగింది. దానిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయగానే, ఆ ఉద్యోగిని తమ కంపెనీ మేనేజర్‌తో మాట్లాడి వాళ్ళిద్దరినీ ఫోన్‌లో కలిపింది. మేనేజర్‌ ఏమీ అనుకోవద్దంటూనే మీరు హిందువులా అని అడిగారు. పడవ నడిపేవారంతా బుక్‌ అయ్యారు. ఒక్కడే ఉన్నాడు. అతడు ముస్లిం. మీకు అభ్యంతరం లేకపోతే అతడిని కేటాయిస్తాం అని మేనేజర్‌ అన్నట్టు మారియా ఫేస్‌ ‌బుక్‌లో పోస్టు చేశారు. ఆ కంపెనీ మేనేజర్‌ ‌మాట తీరుకు మారియా దిగ్భ్రాంతి చెందారు. ఏం అలా అడుగుతున్నారని ఆ మేనేజర్‌ను మారియా ప్రశ్నించగా, భారత్‌లో ముస్లింలు పక్కనుంటే హిందువులు అంగీకరించరటగా అని అన్నాడు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇరుగుపొరగు దేశాల వారు మన గురించి ఎలా అనుకుంటున్నారో తెలియజేసేందుకు ఇది ఉదాహరణ.భారత్‌లో హిందూ తీవ్రవాదులు అధికారంలో ఉన్నారుభారత్‌లో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీరంతా తీవ్రవాదులు కారు. మతోన్మాదులు హిందువుల్లో అధిక సంఖ్యలో లేరు. వారి సంఖ్య తక్కువే. కానీ, వారు దేశంలోని ముఖ్యవ్యవస్థలను అదుపుచేస్తున్నారు. ఈ విషయం మీడియాలో వొస్తున్న వార్తలను బట్టి పొరుగుదేశాల వారు గ్రహించారు. ముంబాయిలో ఆస్పత్రి యూనియన్లు భగ్వధ్వజాలను ఏర్పాటు చేసి హిందూ పతాకాలను ఎగురవేస్తాయి. పోలీసు వాహ నాలపై, ప్రజారవాణా సంస్థ వాహనాలపైనా హిందూ దేవుళ్ళ బొమ్మలను ప్రదర్శిస్తారు. గోశాలలు పబ్లిక్‌ ‌ప్రాంతాల్లో దర్శనిమిస్తాయి. ఆఖరికి బాలీవుడ్‌ ‌సినిమాల్లో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది.

పద్మావత్‌ ‌చిత్రంలో అల్లావుద్దీన్‌ ‌ఖల్జీ పాత్ర రణవీర్‌ ‌పోషించినప్పుడు చెలరేగిన వివాదమే ఇందుకు నిదర్శనం. అయితే, ఈ మాదిరి తీవ్రవాద ధోర ణులు కలిగిన వారు కొద్ది మందే ఉన్నారు. వీరి పోకడల వల్ల మైనారిటీలలో అభద్రతా భావం ఏర్పడుతోంది. ప్రభుత్వం ముస్లిం లపై దాడులను ఉసిగొల్పడం కొత్త కాదు. 1987లో హషీమ్‌ ‌పురాలో 42 మంది ముస్లింల ఊచకోత సంఘటన మోడీ గుజరాత్‌ ‌ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో జరిగిన నరమేథం. గోవులను అపహరించారన్న ఆరోపణ, అనుమానాలపై దళిత వర్గాలపై దాడులు, హత్యలు ఇవన్నీ హిందూ ఉన్మాదుల ప్రాబల్యానికి నిదర్శనాలు. హిందూ తీవ్రవాదానికి నిదర్శనాలు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో సంపన్నుడైన హిందువు తన ఇంటి పక్కన సంపన్నుడైన ముస్లిం ఇల్లు కొనుక్కోకుండా అడ్డుకున్న సంఘటన , కల్లోలిత చట్టం కింద కేసు పెట్టడం వంటి ధోరణులన్నీ హిందూ తీవ్రవాదానికి నిదర్శనాలు. కాశ్మీర్‌లో నెలల తరబడి నాయకులనూ, మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్బంధంలో ఉంచడం, ఒక వర్గంవారిపై ఆంక్షలు విధించడం , అయోధ్యలో ముస్లింలు వ్యతిరేకిస్తున్నా రామాలయం నిర్మాణానికి సన్నాహాలు మొదలైనవన్నీ హిందూ తీవ్రవాదానికి నిదర్శనాలు. వీరికి మెజారిటీ హిందువుల మద్దతు లేదు. అలాగే, మెజారిటీ హిందువులకు హిందూ రాజ్య భావనా లేదు.

Tags: Extreme threat,terrorism, among, Hindus, RSS, padmavath movie

Leave a Reply