Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ‌సభ్యుల దుబారా

రెండేండ్లలో రూ.200 కోట్లు ఖర్చు
న్యూదిల్లీ, మే23 : రాజ్యసభ ఎంపీల కోసం గత రెండేండ్లలో రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎంపీల ప్రయాణ ఖర్చే రూ.63 కోట్లని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కరోనా వైరస్‌ ‌విజృంభించిన 2021-22లో రాజ్యసభ సభ్యుల కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.97 కోట్లు. ఇందులో దేశీయ ప్రయాణాల కోసం రూ.28.5 కోట్లు, అంతర్జాతీయ ప్రయాణాల కోసం రూ.1.28 కోట్లు ఖర్చయింది.

అదేవిధంగా ఎంపీల జీతాలు రూ.57.6 కోట్లు, మెడికల్‌ ‌బిల్లులు రూ.17 లక్షలు, ఆఫీసు ఖర్చులు రూ.7.5 కోట్లని పేర్కొన్నారు. ఎంపీల సమాచార సాంకేతిక సహాయం కోసం రూ.1.2 కోట్లు ఖర్చు చేశారు. 2021-23లో  మొత్తం రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు సెక్రటేరియెట్‌? ‌తెలిపింది. రాజ్యసభ ఎంపీల ఖర్చు వివరాలు కోరుతూ మధ్యప్రదేశ్‌కు చెందిన చందర్‌శేఖర్‌ ‌దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు అధికారులు జవాబిచ్చారు.

Leave a Reply