Take a fresh look at your lifestyle.

అసాధారణ సామర్థ్యం మన సొంతం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత పరిశ్రమ సమాఖ్య సంయుక్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో తెలంగాణ రాష్ట్ర ఐ.టి. పరిశ్రమల మంత్రి  కే.టి.రామారావు చే అభినందన పత్రం అందుకున్న వ్యాసం..

మొబైల్‌ ‌ఫోన్‌ ‌లతో సాంకేతిక విప్లవం లో దూసుకు వెళ్తూ రిమోట్‌ ‌తో నడిచే కార్లను తయారు చేస్తూ అతి చిన్న శస్త్ర చికిత్సలను చేసే రోబోలను సృస్టిస్తున్న మనిషి భవిష్యత్తు కాలంలో మరింతగా కృత్రిమ మెదోసంపత్తి పెరుగే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న కాలంలో మరింతగా అభివృద్ది దిశలో ప్రపంచాన్ని శాసించే స్తాయిలో దేశ భవిష్యత్తును రూపొందించడంలో విద్యార్థుల పాత్ర గణనీయమైయనది. సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ లో దేశాన్ని అగ్రగామిగా ఉంచడంలో విద్యార్థుల పాత్ర కీలకం. మనిషి ఆలోచనలతో తన వలె ఆలోచించే మెషీన్‌ ‌లను తయారు చేస్తున్నాడు.

ఆవిష్కరణలకు అవకాశాలు అంది పుచ్చుకోవాలి
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి మరియు విస్తరణకు ఆవిష్కరణలు చేయడం అతి ప్రాధాన్యమైనది. ఆవిష్కరణను ప్రోత్సహించే సాధనాలను ఉపయోగించటానికి వివిధ అవకాశాలను అందించాలి. అనేక రకాలైన పరిశోధనలు, ప్రభుత్వాలు అవకాశాలను సృష్టించడం, సరైన గుర్తింపును కలిపించడం వల్ల మాత్రమే కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మహానగరాలు, నగరాలను దాటి గ్రామీణ ప్రజలు కూడా కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం ఫలితాలను రుచి చూస్తున్నారు.  పెద్దా, చిన్న రంగమనే వ్యత్యాసమనేది లేకుండా అన్నీ రంగాల్లోనూ విస్తరించింది. ఆవిష్కరణలకు సంబంధించిన అన్నీ అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

 ఆర్టిఫిసియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌తో ఆవిష్కరణలు
ప్రస్తుతం ఆవిష్కరణలన్నీ ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌కు సంబంధించిన  రోబోలు ఎన్నో రంగాల్లో విస్తరిస్తున్నాయి. హోటళ్లలో, రెస్టారెంట్లలో, ట్రాఫిక్‌ ‌నియంత్రణలో,  నిఘా పర్యవేక్షణలో వీటి ఉనికి నానాటికీ పెరిగి పోతున్నది. శాస్త్ర, సాంకేతికతల సహాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం మానవ మేధస్సుకే సవాల్‌ ‌చేసే స్తాయికి ఎదిగింది అనడంలో అతి శయోక్తి లేదోమో. సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ కాలాన్ని శాసిస్తూ విప్లవాత్మకమైన మార్పులను సృష్టిస్తూనే కృత్రిమ మేధస్సును రూపొందిస్తున్నారు.

 విద్యార్థులు ఉరకలేస్తున్నారు
దేశ యువత, విద్యార్థులు నూతన ఒరవడితో ఎన్నో రకాలైన నూతన యాప్స్ ‌ను సృష్టిస్తున్నారు.  ఈ శాస్త్ర సాంకేతిక అభివృద్ది దేశ ప్రజల కు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం దేశ యువత సాంకేతిక విజ్ఞానం లో మెదడుకు పదును పెడుతూ దేశం లో పేరుకు పోయిన ఎన్నో సమస్యల కు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు, పరిష్కార మార్గాల ను శోధించి, సాధిస్తున్నారు. విజయ బాహుటా ఎగరవేస్తున్నారు.

అసాధారణ సామర్థ్యం మన సొంతం
సమస్యలకు నూతన పరిష్కారాలను అన్వేషించగల అసాధారణమైనటువంటి సామర్ధ్యం మన సొంతం.   నూతన పోకడలకు తగ్గట్లుగా ఆలోచనల సరళికి పదును పెడుతూ అసాధ్యం అనిపించేటటువంటి నిర్ణయాలను ఎలా తీసుకోవాలో మన చేతుల్లోనే ఉంది. ఆలోచనల సరళి మనకు సమస్యలను ఎదుర్కొనే శక్తి సామార్ద్యాలను, సమస్యలను పరిష్కారం చేసే  పద్ధతులను సూచిస్తుంది.

 ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌తో పారిశ్రామిక వర్గాలకు అభయం
కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సూక్ష్మ, స్థూల, మధ్యతరగతి పరిశ్రమ వర్గాలను ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ అభయాన్ని అందిస్తోంది. ఆత్మ నిర్భర్‌ ‌భారత్‌ అభియాన్‌లో భాగంగా అందిస్తున్న రుణాలు మైక్రో, స్మాల్‌ అం‌డ్‌ ‌మీడియం పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తాయి కొంత మానసిక డైర్యాన్ని అందించడంలో  చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలకు ఆత్మనిర్భర్‌ ‌రుణాలు కొంత మేలు చేశాయి. ఆర్థిక పురోగతికి ప్రస్తుత కాలంలో ఆత్మనిర్భర్‌ ఎం‌తగానో దోహదం చేసింది. ఇలాంటి ప్రోత్సాహలతో మరింత పరిశ్రమలు వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది.

నూతన ఆవిష్కరణలకు నాంది ఇంటెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్
‌పారిశ్రామిక, శాస్త్రీయ, సాహిత్య మరియు కళాత్మక రంగాలలో మేధో ఫలితాల యాజమాన్యాన్ని ఐపిఆర్‌ (ఇం‌టెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్) ‌విస్తృతంగా సూచిస్తుంది. ఐపిఆర్‌ (ఇం‌టెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్) ‌సృష్టిపై ఆవిష్కర్తలకు కొన్ని ప్రత్యేక హక్కులను కలుగ చేస్తుంది. ఆవిష్కర్తలకు వారి పెట్టుబడుల నుండి సరసమైన రాబడిని పొందే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఆవిష్కర్తలను నూతన పరిశోధనలు చేయాడానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. సమాజ శ్రేయస్సు ప్రయోజనాల కోసం సృజనాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడం ఇంటెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్ ఎం‌తగానో దోహదం చేస్తాయి.

ఇంటెలెక్చువల్‌ ‌ప్రాపర్టీ రైట్స్‌తో ఆవిష్కర్తలకు సరైన ఫలితం
పేటెంట్‌ ‌హోల్డర్‌ అనుమతి లేకుండా తమ ఆవిష్కరణను వాణిజ్యపరంగా ఇతరులు కాపీ చేయడం కానీ, దొంగలించడం కానీ చేయకుండా ఆవిష్కర్తకు హాక్కును అందిస్తుంది. ఈ హక్కులను పొందడం ద్వారా, పేటెంట్లు ఆవిష్కర్తలకు ఆర్థిక పరమైన ప్రోత్సాహకాలను అందిస్తాయి, వారి సృజనాత్మకతకు సరైన  గుర్తింపును అందిస్తాయి. అంతే  కాకుండా వారి పెట్టుబడి సరైన ఫలితం పొందునట్లుగా వాటిని అనుమతిస్తుంది. పేటెంట్‌ ఒక శక్తివంతమైన వ్యాపార సాధనం, కొత్త ఉత్పత్తి లేదా ప్రక్రియపై ప్రత్యేకతను పొందటానికి, బలమైన మార్కెట్‌ ‌స్థితిని అభివృద్ధి చేయడానికి మరియు లైసెన్సింగ్‌ ‌ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఆవిష్కర్తలను అనుమతిస్తుంది.

వైఫల్యాలు కూడా ఆవిష్కరణలో భాగమే అని గుర్తించాలి

వ్యక్తులు ఎప్పుడూ అన్నింటిలో విజయాలనే సాధించాలనే రూలు ఏమి లేదు. వైఫల్యాలు కూడా లెక్క చేయకుండా మనో దైర్యంతో కొత్త ఆవిష్కరణలకు అడుగులేస్తే, నలుగురికీ ఉపాధి కల్పించే యజమానులవుతారు. ధామస్‌ ఆల్వా ఎడిసన్‌  ఒక వైఫల్యంతోనే నిరాశ చెందితే అద్భుతమైన ఆవిష్కరణలు సాధ్యపడేవే కాదు. నూతన ఆవిష్కరణల వైపు మరింతగా ప్రోత్సహిస్తే భారతదేశం అంకుర సంస్థల అంతర్జాతీయ కేంద్రంగా మారగలుగుతుంది అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

పేటెంటు హక్కులను పొందడంలో ప్రోత్సాహం అందించాలి
2014వ సంవత్సరాని కన్నా ముందు మన దేశం లో ప్రతి సంవత్సరాని కి సరాసరి నాలుగు వేల పేటెంట్‌ ‌లు ఉండేవి.  ప్రస్తుతం ఈ సంఖ్య ఏటా 15 వేల కు పైగా పెరిగి, దాదాపు నాలుగింతలు అయింది. పేటెంట్ల కోసం దరఖాస్తు చేయడం మన దేశంలో కొంత ఖరీదైన పనే కాకుండా శ్రమతో కూడిన వ్యవహారం కూడా. మన దేశంలో ప్రస్తుతం మేధా హక్కుల కోసం ఒక పేటెంటు దరఖాస్తు చెయ్యాలంటే వెయిల రూపాయాలు ఖర్చు అవుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు పేటెంట్లను ప్రోత్సహించడానికి కొత్తవారికి  ఫీజులో రాయితీ ఇవ్వడమే కాకుండా, పేటెంట్‌ ‌నిధి నుంచి నగదు ప్రోత్సాహకాలూ అందిస్తున్నారు ఇలాంటి ప్రోత్సాహకాల వల్లే నేడు ఆయాదేశాలలో ఆవిష్కరణల రంగంలో ముందంజ వేస్తోంది.
డా. అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌,  ‌ప్రత్యేక విద్యా శిక్షణా కార్యక్రమ రాష్ట్ర రిసోర్సు పర్సన్‌, 9703935321

Leave a Reply