Take a fresh look at your lifestyle.

వైద్య శాఖ, పారిశుధ్య సిబ్బందికి అదనపు వేతనం ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమలు చేయడంలో వైద్య, ఆరోగ్య శాఖ, పారిశుధ్య సిబ్బందికి అదనపు వేతనం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొరోనా వైరష్‌ ‌నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, వీధులను శుభ్రం చేస్తూ వైరస్‌ ‌నియంత్రణకు పాటుపడుతున్న పారిశుధ్మ కార్మికులకు అదనపు వేతనం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మూలవేతనంలో 10 శాతం అదనపు నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, జీహెచ్‌ఎం‌సిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రూ. 7,500, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బందికి రూ. 5000 సీఎం ప్రత్యేక ప్రోత్సాహక వేతనం కింద నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!