ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి – బాధితుల పరామర్శ, ఓదార్పులు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కమలాపూర్ మండలం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పొంగిపొర్లుతున్న వాగులు సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. మండలంలోని ఉప్పల్ చెరువును సందర్శించి కోతకు గురైన రోడ్లను పరిశీలించారు. కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి ప్రాంతాన్ని పరిశీలించి ముంపుకు గురైన రైతులను పరామర్శించారు. మండలంలోని పల్లి పల్లి గ్రామాల వాగులను ముంపు ప్రాంతాలను క్షుణంగా పరిశీలించి, రానున్న తుఫాను ఉందని ముందే పసిగట్టిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వంగపల్లి గ్రామానికి చెందిన జూపాక అనిల్ ను పరామర్శించి, అనిల్‌కు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లా పని చేస్తూ తమ కుటుంబాలను, తమ గ్రామాలను ,తమ జిల్లాను, తమ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జెడ్పి చైర్ పర్సన్ కనుముల విజయ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నవీన్, మాజీ ఎంపీపీ లాండిగా లక్ష్మణరావు, మండల తెలంగాణ రాష్ట్ర సమితి యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు కొలుగురి రాజ్ కుమార్, మండల నాయకులు జన్ను వేణుగోపాల్, శోభన్ కుమార్, పుల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.