Take a fresh look at your lifestyle.

పివిఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే) నుండి ఎయిర్‌ ‌పోర్టు..

  • రహదారిపై ఇరువైపులా విస్తృత ప్లాంటేషన్‌
  • అధికారులకు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ఆదేశించారు

ఆరంఘర్‌(‌పివిఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే) నుండి ఎయిర్‌ ‌పోర్టుకు అనుసంధానించే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్‌ ‌చేపట్టాలని అధికారులను సిఎస్‌ ‌సోమేష్‌కుయార్‌ ఆదేశించారు. రహదారికి ఇరువైపుల పుష్పించే మొక్కలతో మల్టీకలర్‌/‌మల్టీలేయర్‌ అవెన్యూ ప్లాంటేషన్‌(ఎంఎల్‌ఏపి)ను చేపట్టాలని ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు హరిత అనుభవాన్ని అందించాలని సిఎస్‌ ‌జిహెచ్‌ఎం‌సి అధికారులను ఆదేశించారు. సిఎస్‌ ‌నేషనల్‌ ‌హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా(ఎన్‌హెచ్‌ఏఐ), ‌జిహెచ్‌ఎం‌సి అధికారులతో శుక్రవారం బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌లో సమావేశం నిర్వహించారు.

అంతకుముందు సిఎస్‌ ‌తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై బుద్వేల్‌ ‌వద్ద జిహెచ్‌ఎం‌సి ద్వారా చేపట్టిన మల్టీలెవల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ ‌శర్మ, జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ‌లోకేశ్‌ ‌కుమార్‌, ‌పంచాయతీ రాజ్‌ ‌శాఖ కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్‌&‌బి ఇంజనీర్‌ ఇన్‌ ‌ఛీప్‌ ‌గణపతి రెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, కేంద్ర రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి ఎస్‌కె ఖుష్వా, ఎక్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌ధర్మారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply