Take a fresh look at your lifestyle.

తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ ‌విద్యా సంస్థల దోపిడీ

అసలే కరోనా కాలం ఆపై పని దొరకని సమయం, ఎలాగో అలాగా కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాలు, చూసి చూసి ఖర్చు పెడుతున్నా మధ్యతరగతి వర్గాలు. ఇప్పుడిప్పుడే పని దొరుకుతుంది,మెల్ల మెల్లగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి, పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి,9వ,10వ తరగతులు ఆపై తరగతులు మొదలైనాయి. ఆన్లైన్లో పాఠాలు అర్థంఅయ్యి కానీ విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు.ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన కాలం కేవలం మూడు,మూడున్నర నెలలే. సరిగ్గా ఇప్పుడే ప్రైవేటు విద్యాసంస్థలకు బంగారు బాతు దొరికినట్లయింది.సంవత్సరానికి వసూలు చేసే ఫీజులు కేవలం మూడున్నర నెలలకే చెల్లించాలని విద్యార్థులకు,వారి తల్లిదండ్రులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు, ఎందుకని ప్రశ్నిస్తే, మేము ఆన్లైన్‌ ‌క్లాసులు చెప్పలేదా? భవనాలకు రెంట్లు చెల్లించలేదా? మీకు అకాడమిక్‌ ఇయర్‌ ‌పూర్తి కావడంలేదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు .ప్రభుత్వం 30 శాతం సిలబస్‌ ‌తగ్గిస్తే,ప్రయివేటు విద్యాసంస్థలు మాత్రం 100% ఫీజు అంటే సంవత్సరానికి కట్టే ఫీజు మూడున్నర నెలలకే కట్టమంటుంన్నారు. ఎందుకు కట్టాలని అడిగితే ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే వెళ్లండని ముఖం మీదే చెప్తున్నారు.

దిక్కుతోచని తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితులలో అప్పుతెచ్చి మరి ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం మాత్రం జీవోలు జరిచేశాం, పర్యవేక్షణ చేస్తున్నమని చెప్పిన దోపిడీ మాత్రం యధేచ్చగా కొనసాగుతూనే ఉంది. కేవలం రెండవ తరగతి విద్యార్థికి అది మాములు ఒక ప్రయివేటు పాఠశాలవారు కేవలం ట్యూషన్‌ ‌ఫీజుగా 21 వేల రూపాయలు చెల్లించమని డిమాండ్‌ ‌చేస్తున్నారు.పోనీ ఆన్లైన్‌ ‌క్లాసులైన జరిగాయంటే రెండో తరగతి పిల్లలకు ఆన్లైన్‌ ‌క్లాసులులో వారు ఏమిచెప్పినట్లు, పిల్లలు ఏమి వినట్లు?ఐదవ తరగతికి కేవలం ట్యూషన్‌ ‌ఫీజుగా 30,000 రూపాయలు ఫిక్స్ ‌చేశారు.చెప్పేది ఆన్లైన్‌ ‌క్లాసులే కదా,అందులో 30% సిలబస్‌ ‌తగ్గించారుగా అంటే ఇష్టం ఉంటే వినండి,లేకుంటే వినకండి అని గదిరింపులు.పాఠశాలల ట్యూషన్‌ ‌ఫీజులు ప్రభుత్వం నెల నెల కట్టమంటే లేదు రెండు లేదా మూడు విడతల్లోనే కట్టాల్సిందే అని విద్యార్థులను ఆన్లైన్‌ ‌క్లాస్‌ ‌లొనే హెచ్చరిస్తున్నారు.సమయానికి కట్టకపోతే ఆన్లైన్‌ ‌క్లాస్‌ ‌లింక్‌ ‌కట్‌ ‌చేస్తున్నారు.9వ,10వ తరగతి విద్యార్థులు మూడున్నర నెలలకే మారుమాట్లాడకుండా మొత్తం ఫీజు చెల్లించాల్సిదే.ఎవరైనా ఎందుకు అని ప్రశ్నిస్తే మేము టీచర్లకు జీతాలు ఇవ్వడంలేదా అని తిరిగి ప్రశ్నిస్తారు. నిజమే కదా టీచర్లకు జీతాలు ఇవ్వాల్సి ఉందికదా అని విచారిస్తే, ఆన్లైన్‌ ‌క్లాసులు కొంతమంది టీచర్ల తో మాత్రమే చెప్పించి వారికి మాత్రమే 50% నుంచి 25% వరకు జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు.మిగిలిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అంటే ఇస్తున్న జీతాలు 50 నుంచి 25 శాతం వరకు,కానీ వసూలు చేస్తున్న ఫీజు 100%..పోనీ ఇతర పాఠశాలలకు వెళ్దామంటే టీసి ఇవ్వరు.అయిన 8వ తరగతి వరకు టీసి అవసరం లేదుగా అని వేరే పాఠశాలకు వెళ్తే పాత పాఠశాలలో విద్యార్థి పేరు చైల్డ్ ఇన్పోలో తొలగించరు. ఆ విద్యార్థి పేరు కొత్త పాఠశాలల్లో నమోదు కావటం లేదు.చైల్డ్ ఇన్ఫోలో పేరు తొలగించాలంటే పాత పాఠశాలకు ఫీజు కట్టాల్సిందే.

ఇక కళాశాలల సంగతి చెప్పనక్కర్లేదు.ప్రయివేటు కళాశాలలలో చేరిన విద్యార్థులు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే. ముఖ్యంగా ఇంటర్‌ ‌రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం సంవత్సర ఫీజు కట్టాల్సివస్తుంది. మూడు నెలలకే సంవత్సరం ఫీజు కట్టాల అని ప్రశ్నిస్తే నీవు మా కాలేజీలో చదువుతున్నవన్న విషయం మర్చిపోవద్దు అని పరోక్షంగా బెదిరింపులు. ఎటుతోచని తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజు కట్టాల్సివస్తుంది.ఈ దోపిడీ చిన్నచిన్న పాఠశాలలు,కళాశాలల్లో ఉండకపోవచ్చు, కానీ ఓ మోస్తరు పెద్ద పాఠశాలలు, కళాశాలల్లో మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.కరోనా కాలంలో అన్ని వర్గాలకు చివరకు ప్రభుత్వాలకు సైతం ఆదాయం తగ్గి కష్టాలు,నష్టాలపాలైతే , విద్యా,వైద్య సంస్థలు మాత్రం నష్టాలుకాదుసరికదా లాభాల బాటలో ప్రయాణిస్తున్నాయి.ఉపాధ్యాయులను తొలగించడం, ఉన్న వారికి జీతాలు తగ్గించడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో చరవ్యయలు పూర్తిగా తగ్గిపోయాయి.కానీ ఫీజులు మాత్రం మొత్తం వసూలు చేస్తూ ఎడారిలో పంటలు పండించినట్లు కరోనా కాలంలో లాభాలు గడిస్తున్నారు. ఒక పక్క గత కొన్ని సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తు ఆ విద్యాసంస్థనే నమ్ముకుని ఉన్న ఉపాధ్యాయులను,వర్కర్లను, డ్రైవర్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ లేదా జీతాలు తగ్గిస్తూ మరోపక్క విద్యార్థులనుంచి మొత్తం ఫీజు వసూలు చేస్తున్నారు.

మార్కెట్లో కూరగాయల బేరంవలే ఒకరికి ఒక్క లెక్క,మరొకరికి మరోలెక్క.ఫీజులకంటు ప్రామాణిక విధానమే లేదు.దానికి తోడు మెటీరియల్‌ అని వగైరా వగైరా అమ్మకాలు జరిపి ఒక పెద్ద బుక్‌ ‌స్టోర్‌ ‌నే నడిపిస్తున్నారు.ఎందుకు అని ప్రశ్నిస్తే మా మెటీరియల్నే చదవాలని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే ఆ విద్యార్థిని అందరి ముందు చులకనగా చూడడం, అందరి విద్యార్థులను ఒక మాదిరి ,ప్రశ్నించిన విద్యార్థిని మరో మదిరిగా చూస్తున్నారు. అట్టి విద్యార్థులు ఏమీ చేయలేక లోలోపల కుమిలిపోతున్నారు.అట్టి విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలకు,కళాశాలలకు వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్దేశపూర్వకంగానే మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు.

private educational institutions, fees1

విద్యా రంగం అంటే లాభాల కోసం కాదని సమాజ సేవ కోసం అని అనేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అత్యంత లాభాలు గడించే రంగంగా మార్చివేశారు. ఒకప్పుడు మనిషికి కనీస అవసరాలు కూడు,గుడ్డ, నీడ అనే వాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి, ఇప్పుడు కనీస అవసరాలు విద్యా ,వైద్యం. కనీస అవసరాల వ్యాపారం మార్కెట్లో కాసులు కురిపిస్తుంది. అభివృద్ధి అంటే అందమైన రోడ్లు,పెద్దపెద్ద భవనాలు,పెద్ద పారిశ్రామిక సంస్థలు,విదేశిపెట్టుబడులు మాత్రమే కాదనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజలకు కావలసిన కనీస అవసరాలైన విద్యా,వైద్యం ఉచితంగా అందించడం కాదు, నాణ్యంగా ఉండాలి. నాణ్యమైన విద్యా,వైద్యమే భవిష్యత్తు పెట్టుబడి అని అందరు గ్రహిస్తే, అదే భవిష్యత్తు లో నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుంది.

jurru narayana yadav.jp
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్నగర్‌జి
9494019270.

Leave a Reply