Take a fresh look at your lifestyle.

కార్పోరేట్‌ ‌కాలేజీల ఫీజుల దోపిడీ

టిఆర్‌ఎస్‌ ‌నేతలకు మామూళ్లే కారణమన్న బండి
రాష్ట్రంలోని కార్పొరేట్‌ ‌కళాశాలల నుంచి టీఆర్‌ఎస్‌ ‌నేతలకు మామూళ్లు అందడంతోనే యాజమాన్యాల అరాచకాలకు మద్దతు తెలుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

కార్పొరేట్‌ ‌విద్యాసంస్థల ఆగడాలు, అరాచకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మౌనం వీడి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. పిల్లల చదువుల కోసం రాత్రింబళ్లు కష్టపడే తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని లేదంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేవలం మూడు నెలల ప్రత్యేక్ష తరగతులు నిర్వహించి ఏడాది ఫీజులు వసూలు చేయడం ఎంత వరకు సమంజసం అని ధ్వసమెత్తారు.

ఫీజుల వేధింపులకు గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు అండగా ఉండాలని యువమోర్చా నాయకులకు పిలుపునిచ్చారు. ఫీజుల పేర్లతో నిత్యం వేధిస్తే విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతిని మానసికి ఒత్తిడికి గురై చదువుపై దృష్టి పెట్టలేకపోతారని పేర్కొన్నారు. నాడు ఉద్యమ సమయంలో కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలను హెచ్చరించిన నాయకులు ప్రస్తుతం మౌనంగా ఉండటానికి కారణమేంటని బండి సంజయ్‌ ‌ప్రశించారు. రాష్ట్రంలో వసూళ్ల దోపిడీకి పాల్పడుతున్న కళాశాలలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply