Take a fresh look at your lifestyle.

ఏ ‌చట్టం ప్రకారం పెన్షనర్ల వేతనాల్లో కోత విధిస్తున్నారు?

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలలో కోత విధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ‌చట్టవిరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్‌లో కోత విధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పెన్షనర్లకు పూర్తి పించను చెల్లించాలంటూ పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది వాదించారు. వేతనాలలో కోత కారణంగా ఉద్యోగులు, పెన్షన్‌దారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా ఖజానాకు ఆదాయం తగ్గిందనే సాకుతో ప్రభుత్వం
వేతనాలలో కోత విధిస్తున్నదనీ, ఆ మొత్తం వారికి ఎప్పుడు ఇస్తుందో, లేదో కూడా తెలియని పరిస్థితుల్లో వారంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

వేతనాల్లో కోత విధించడాన్ని వెంటనే నిలిపివేయడంతో పాటు గతంలో తగ్గించిన వేతనాన్ని వెంటనే మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ ‌హైకోర్టుకు విన్నవించారు.  పిటిషనర్‌ ‌వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ఏ చట్టం ప్రకారం కోత విధిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్డినెన్స్‌పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, విపత్తులు, అత్యయిన పరిస్థితులలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ‌తీసుకురాగా, గవర్నర్‌ ‌దానికి ఆమోదముద్ర వేశారు.

Leave a Reply