Take a fresh look at your lifestyle.

కాణిపాకం వినాయకుడికి 7కోట్ల విరాళం

‌చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడికి ప్రవాస భారతీయ భక్తుడు రూ.7 కోట్ల విరాళం అందించాడు. ఆలయ ఈఓ వెంకటేశ్‌కు శనివారం ఉదయం విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కాణిపాకం ఆలయ పునర్నిర్మాణానికి రూ.8.75కోట్ల మేర ఖర్చు అవుతుందని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని ప్రవాస భక్తుడు చెప్పారని, ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.7 కోట్ల చెక్కు అందజేశారని ఆలయ ఈవో తెలిపారు.

ఈ సందర్భంగా దాత, ఆయన కుటుంబీలకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే విరాళం అందజేసిన భక్తుడు తన పేరును వెల్లడించేందుకు నిరాకరించాడు.

Leave a Reply