Take a fresh look at your lifestyle.

నేడు ఎపి కేబినేట్‌ ‌విస్తరణ

ఖాళీ అయిన స్థానాల్లో ఇద్దరిచేత ప్రమాణం

అమరావతి,జూలై 21 : ఆంధ్రప్రదేశ్‌ ‌కేబినెట్‌ ‌విస్తరణకు ముహూర్తం ఖరారు అయ్యింది. బుధవారం మధ్యాహ్నం 1.29 నిమిషాలకు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌కొత్త మంత్రులతో ప్రమాణం చేయిస్తారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి  వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు.

పిల్లి సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌మోపిదేవి వెంకట రమణారావు  రాజ్యసభకు ఎన్నికకావడంతో తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను నిన్న గవర్నర్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే.ఖాళీ అయిన  స్థానాల్లో కొత్త మంత్రులను నియమించనున్నారు. మంత్రుల శాఖల మార్పిడి కూడా ఉంటుందని తెలుస్తున్నది.కాగా ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామాతో ఖాళీ అయిన రెండు స్థానాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ అభ్యర్థులను ఖరారు చేశారు.పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ వర్గానికి చెందిన మోసేను రాజు,రాయచోటికి చెందిన మైనార్టీ మహిళా నేత మైనా జకియాఖానుంను నామినేట్‌ ‌చేయాలని గవర్నర్‌ ‌బిశ్వబూషన్‌ ‌హరిచందన్‌ను ప్రభుత్వం కోరింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply