తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 21న కేంద్రమంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలో 1,400 కిలోవి•టర్ల జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 750 కిలోవి•టర్ల మేర జాతీయ రహదారులను ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేస్తే..పెండింగ్‌లో ఉన్న వాటికి కేంద్రం అనుమతిస్తుందన్నారు.
హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డుకు త్వరలో అనుమతి లభించనుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే రోడ్ల విస్తరణకు తెలంగాణ సర్కార్ సహకరించడం లేదన్నారు. దేశవ్యాప్తంగా భారతమాల పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 35,000 కిలోవి•టర్ల జాతీయ రహదారులను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో 1,400 కిలోవి•టర్ల జాతీయ రహదారులను భారత మాల పరియోజన అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అదనంగా, భారత మాల పరియోజన కింద 750 కిలోవి•టర్ల ఎక్స్‌ప్రెస్‌వేలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.