Take a fresh look at your lifestyle.

మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ

  • ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు
  • వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకుండా పథకం అమలు
  • వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రారంభించిన సిఎం జగన్‌

అమరావతి,జూలై 16 : ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలను ప్రారంభించారు. వైద్య ఖర్చులు రూ.వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో హా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్‌ ‌ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రారంభించారు. తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్‌, ‌కర్నూలు జిల్లాల్లో  అమల్లోకి తీసుకు రానున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ  పరిధిని విస్తృతంగా పెంచుతున్నామని తెలిపారు. ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని తెలిపారు. ఆస్పత్రులకు గ్రేడింగ్‌ ‌విధానం అమలు చేస్తామని  పేర్కొన్నారు. కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. వైద్యం కోసం ఎవరూ అప్పులు పాలు కాకూడదు.

కోటి 42 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపు రేఖలు మారుస్తామని సీఎం జగన్‌ ‌తలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తామని  సీఎం తెలిపారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు గత ప్రభుత్వ బకాయిలన్నింటినీ చెల్లించామని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1059 చికిత్సలు ఉంటే..ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని వెల్లడించారు.  త్వరలో అన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ అదనపు సేవలు వర్తింపు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 27 టీచింగ్‌ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకొచ్చాం. డబ్ల్యూహెచ్‌వో సూచించిన మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇస్తున్నామని సీఎం జగన్‌ ‌తెలిపారు. వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దని  ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతామని  జగన్‌ అన్నారు. వైద్య ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్‌ ‌ప్రాజెక్ట్ ‌కింద ఎంపిక చేసి అమలు చేశామని అన్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో విస్తరించినట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీలో మొత్తం 2,200 రకాల రోగాలకు వైద్య చికిత్సలు అందించనున్నామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాకు విస్తరిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందించిన ఆస్పత్రులకు బకాయిలన్నింటిని చెల్లించామని జగన్‌ ‌తెలిపారు.ఇప్పటివరకు 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. మరో కొత్తగా 16టీచింగ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని వైఎస్‌ ‌జగన్‌ ‌వెల్లడించారు. కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు.

Leave a Reply