Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ‌పరిధిలో విస్తరిస్తున్న పాజిటివ్‌ ‌కేసులు..

  • బర్త్‌డే పార్టీలో పాల్గొన్న 23మందికి కొరోనా
  • మాదన్నపేట ఘటనపై ఆరా తీస్తున్న పోలీసులు

జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొరోనా విజృంభిస్తోంది. మాదన్నపేటలోని  ఒక అపార్ట్‌మెంట్‌లో 23 మందికి కొరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్దారించారు. చైతన్యపురి ప్రశాంతినగర్‌లో మహిళకు కరోనా పాజిటీవ్‌, ‌చందానగర్‌ ‌జవహర్‌నగర్‌ ‌రోడ్డులో 80 ఏళ్ల వృద్ధురాలికి పాజిటివ్‌.. అలాగే పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో తండ్రీ, కుమారుడికి కరోనా వైరస్‌ ‌సోకినట్లు సమాచారం. తండ్రి ఒక పరిశ్రమలో చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు ప్రైమరీ కాంటాక్టస్‌పై ఆరా తీస్తున్నారు.

కొరోనా వైరస్‌ ‌నివారణలో భౌతిక దూరం పాటించకపోవడంతో జరిగే అనర్థాలపై ప్రభుత్వాలు, పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా… ఇంకా చాలా మంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం నగరంలోని సంతోష్‌ ‌నగర్‌ ‌మాదన్నపేట్‌ ‌సంఘటన. స్థానిక ఓ అపార్ట్ ‌మెంటల్‌లో నివాసం ఉండే 23 మందిలో కరోనా పాజిటివ్‌ ‌లక్షణాలు బయటపడ్డాయి.

Leave a Reply