Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాప్తితో విస్తరిస్తున్న .. సెల్ఫ్ ‌లాక్‌డౌన్

  • పలుప్రాంతాల్లో వ్యాపారుల స్వచ్ఛంద నిర్ణయం
  •  కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి కట్టడిలో భాగంగా ఎక్కడిక్డక ప్రజలు, వ్యాపారాలు సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌ప్రకటించుకుంటున్నారు.
ఇప్పటికే సికింద్రాబాబ్‌, ‌బేగంబజార్లలో లాక్‌డౌన్‌ ‌ప్రకటించారు.  తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో కూడా వ్యాపారుఉల లాక్‌డౌన్‌ ‌ప్రకటించారు. అలాగే పలు జిల్లాల్లో కూడా దీనిని అమలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ ‌తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్‌ ‌నిర్ణయం తసీఉకున్నట్లు  దిల్‌సుఖ్‌నగర్‌ ‌వెంకటాద్రి మార్కెట్‌ అసోసియేషన్‌ ‌వస్త్ర వ్యాపారులు తెలిపారు. స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే మనల్ని మనం కాపాడుకోగలుగుతామని చెప్పారు. సిటీలో వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌పాటించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వస్త్ర దుకాణాలను మూసేసిన వ్యాపారులు.. డియాతో మాట్లాడారు. రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌ ‌సిటీలో కరోనా వైరస్‌ ‌రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో కస్టమర్లు, తమ కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారం భారీగా నష్టపోతామని తెలిసీ సెల్ఫ్ ‌లాక్‌డౌన్‌ ‌పాటించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రభుత్వం కరోనా టెస్టులు పెంచడంలో, మెరుగైన వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని అన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా బారిన పడొద్దని సూచించారు. ఇకపోతే మంచిర్యాల, సిరిసిల్లల్లో సెలూన్‌ ‌షాప్‌ ఓనర్లు లాక్‌డౌన్‌ ‌ప్రకటించారు.  వైరస్‌ ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలే స్వీయం నిర్బంధం వైపు అడుగులు వేస్తున్నారు.
వ్యాపారులు, వివిధ సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ‌పాటిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వారం రోజుల్లో  పది మంది  కరోనా బారిన పడ్డారు. జిల్లాలో 36 మందికి పాజిటివ్‌ ‌రాగా ఇద్దరు మృతిచెందారు. పాజిటివ్‌ ‌వచ్చిన వారు మహారాష్ట్ర, హైదరాబాద్‌ ‌నుంచి వచ్చిన వారు కాగా వారి ద్వారా వారి కుటుంబసభ్యులకు సోకింది. జిల్లాలో ఇప్పటి వరకు 7,400 మంది •ం క్వారంటైన్‌ ‌పూర్తి చేసుకున్నారు. 1749 మంది •ం క్వారంటైన్‌లో ఉన్నారు. 287 మంది శాంపిళ్లు పంపించగా మరో 22 శాంపిళ్ల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో వ్యాపారాలను మధ్యాహ్నం వరకే నిర్వహించాలని నిర్ణయించుకుంటున్నారు. సిరిసిల్లలో కిరాణా వర్తక దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు, రెడిమేడ్‌ ‌దుకాణాలు సాయంత్రం 6వరకు తెరచి ఉంచుతున్నారు. పలు మండల కేంద్రాల్లో మధ్యాహ్నం 2గంటలకే మూసి వేస్తున్నారు. సిరిసిల్లలో పది హేను రోజులపాటు సెలూన్లు మూసి వేయాలని నిర్ణయించారు.

Leave a Reply