Take a fresh look at your lifestyle.

ఆర్టీసీని మళ్లీ పట్టాలెక్కించేందుకు కసరత్తు

ఆర్టీసీ నష్టాలతో పాటు దానిని గట్టెక్కించే విషయంలో సిఎం కెసిఆర్‌ ‌మారోమారు దృష్టి సారించారు. ఈ మేరకు ఉన్నతస్థాయి సవి•క్ష చేపట్టారు. కొత్తగా ఛైర్మన్‌, ఎం‌డిలను నియమించడంతో వారికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మంగళవారం సవి•క్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సంస్థకు వొస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

అర్టీసీకి ప్రస్తుతం ఎంత ఆదాయం వస్తుంది..ఏ మార్గాల్లో ఎక్కువ వొస్తుందని సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌మాట్లాడుతూ ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు, ఇతర నిధులు రూ.1,500 కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కేటాయించారని తెలిపారు. బడ్జెట్‌ ‌నిధులు నెలానెలా విడుదలవుతున్నాయని చెప్పారు. బడ్జెటేతర నిధుల కింద ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల పూచీకత్తు ఇవ్వడంతో బ్యాంకు రుణం మంజూరు చేసిందని చెప్పారు. అందులో రూ.500 కోట్లు వొచ్చాయన్నారు.

ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలు, అప్పులపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి ఆర్టీసీ నూతన చైర్మెన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply