Take a fresh look at your lifestyle.

దిల్లీ నుండి వచ్చిన వారిపై.. ప్రత్యేక నిఘా పెట్టండి

  • ఏప్రిల్‌ 15 ‌వరకు ఇంటి నుండి బయటకు రావొద్దు
  • సామాజిక దూరం పాటించడం వల్లే కొరోనాను అడ్డుకోవడం సాధ్యం
  • ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది
  • ప్రభుత్వ సూచనలు పాటించండి : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు

డిల్లీ నుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి అని, సామాజిక దూరం పాటించడం వల్లే కరోనాను అడ్డుకోవడం సాధ్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ‌లోని కలెక్టర్‌ ‌ఛాంబర్లో కరోనా వైరస్‌ ‌నివారణకు సంబంధిచి సమీక్ష సమావేశమును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించినట్లయితే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని అన్నారు.

ఏప్రిల్‌ 15 ‌వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, ఎవరి ఇంటిలో వారే ఉన్నట్లయితే మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామని తెలిపారు.సంగారెడ్డి పట్టణంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులకు సూచనలు పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ ఎవరికైనా జలుబు దగ్గు లాంటి ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని మంత్రి హరీష్‌రావు ప్రజలకు సూచించారు.

క్వారంటైన్‌లో ఉన్న వీరిని పరిక్షల నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎం .ఎన్‌ .అర్‌ ‌హాస్పిటల్‌లోని ఐసొలేషన్‌ ‌వార్డ్‌లో వున్నారని, వీరిని పూర్తిగా పరిశీలనలో ఉంచామన్నారు. వీరి రిపోర్టులు వచ్చిన తరువాత చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమములో ఎంపీ ప్రభాకర్‌ ‌రెడ్డి , జిల్లా కలెక్టర్‌ ఎం,‌హనుమంత రావు, చంద్రశేఖర్‌ ‌రెడ్డి ఆదనపు కలెక్టర్‌ ‌రాజశ్రీ షా , పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy