Take a fresh look at your lifestyle.

చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

  • అనుమతి లేదంటూ టిడిపి శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసుల తీరుకు నిరసనగా టిడిపి నేతల ఆందోళన

కుప్పం,జనవరి4 : కుప్పం నియోజకవర్గం కేనుమాకురిపల్లిలో చంద్రబాబు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసుల చెప్పడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో వందలాది మంది పోలీసులు మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పర్యటనకు జనం రాకుండా చేసేందుకు పోలీసులు భయాందోళన కలిగించేలా ప్రవర్తిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ టిడిపి శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

టిడిపి అధినేత చంద్రబాబు కాసేపట్లో కుప్పం చేరుకోనున్న సందర్భంగా పర్యటనకు సంబంధించి టిడిపి నేతలు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌ ‌నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు.. ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో కుప్పం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం పెద్దూరు గ్రామానికి చంద్రబాబు చేరుకోనున్నారు. సాయంత్రం కేనుమాకురిపల్లిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గంటారు.

మరోవైపు చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురం మండలానికి వెళ్లాల్సిన టిడిపి ప్రచార శాంతిపురం మండలం పెద్దూరు, శివకురుబూరు గ్రామాల్లో నిర్వహించనున్న ’ఇదేంఖర్మ రాష్టాన్రికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గననున్నారు. ఈ సందర్భంగా అక్కడ సభ ఏర్పాటు చేసే సభలో పాల్గనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన ఉండే మార్గాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే కొన్నిచోట్ల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నిలువరించారు.

Leave a Reply