Take a fresh look at your lifestyle.

వైన్ షాప్ లలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు..!

మార్చి 22వ తేదీ వరకు ఉన్న మద్యం దుకాణాల్లో ఉన్న నిల్వలు , రికార్డులు , ప్రస్తుతం ఉన్న స్టాక్ తో సరిపోల్చి పరిశీలన చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని వైన్ షాపులలో మద్యం ఖాళీ చేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మద్యం వ్యాపారులు , స్థానిక రాజకీయ నాయకులు , ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలోనే.. బ్లాక్ మార్కెట్ కు అక్రమ మద్యం ను అమ్మారనే ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది.ఎక్సైజ్ కమీషనర్ లకు సైతం వందలాది ఫిర్యాదులు రావడం జరిగింది.తెలంగాణ లోనూ *వైన్ షాప్* ల ఓపెన్ చేసే విషయంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Excise police checks in wine shops ..!

ఒకవేళ తెలంగాణ రాష్ట్రం లో మద్యం షాపులకు అనుమతులు మంజూరు చేస్తే , మద్యం ప్రియులు ఒక్కసారిగా జనసంద్రంగా మారితే పరిస్థితి ఏమిటని , స్టాక్ ఎలా ఉందని , సరిపడా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మద్యం షాపులు ఒక్కసారిగా తెరవడంతో జనాలు ఒక్కసారిగా రావడం , భౌతిక దూరం పాటించక పోవడం , మాస్కులు దరించకపోవడం , శానిటైజర్లను ఉపయోగించక పోవడం , బాధ్యతగల ప్రభుత్వ ఉపాధ్యాయులను , పోలీసులను లిక్కర్ షాప్ ల వద్ద విధులు కేటాయించడం వలన అన్ని వర్గాల నుండి , ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని మంత్రులు , అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.ఇక మద్యం దుకాణాలలో మద్యం లెక్కలు సరితుగకపోతే బాధ్యులపై కుడా చర్యలు తప్పవని సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!