Take a fresh look at your lifestyle.

గురుకులాలు మినహా.. యథాతథంగా నేటి నుంచి అన్ని పాఠశాలలు ప్రారంభం

హైకోర్టు ఆదేశాలకనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో గురుకులాలు, రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలు మినహా నేటి నుంచి అన్ని పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల ప్రారంభం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారం ప్రకటన జారీచేసింది. మంగళవారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆడ్వకేటు జనరల్‌తో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా సవరణలు చేస్తూ పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించారు.

ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురుకుల విద్యాలయాలు మినహాయించి రాష్ట్రంలో కెజి నుంచి పిజి వరకు అన్ని పాఠశాలలు, అంగన్‌ ‌వాడీ సహా అన్ని కేంద్రాలలో నేటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నిర్ణయించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని బలవంత పెట్టవద్దని విద్యా శాఖ జిఓ విడుదల చేసింది. క్లాసులు ఏ పద్ధతిలో నిర్వహించాలనే స్వేచ్ఛ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కుంది. గురుకులాలు, రెసిడెన్సియల్‌ ‌స్కూళ్లు మినహా మిగతా వాటికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆఫ్‌లైన్‌తో పాటు అన్‌లైన్‌లోనూ స్కూళ్లు కొనసాగుతాయని తెలిపింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు రెసిడెన్షియల్‌, ‌గురుకులాలను మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply