Take a fresh look at your lifestyle.

అద్భుతమైన అంటి ఆక్సిడెంట్‌, ఇమ్యూనిటి బూస్టర్‌ – ‌విటమిన్‌ ‘‌సి’

మన శరీరంలోని వివిధ జీవేక్రియలకు అవసరమైన, ఆవశ్యకమైన  సూక్ష్మ  పోషకం – విటమిన్‌ ‘‌సి’.  నీటిలో కరిగే ఈ విటమిన్‌ ‌ను రసాయనికంగా •- ఆస్కార్బిక్‌ ఆమ్లం అని అంటారు.  ఇది ఒక అద్భుతమైన అంటి యాక్సిడెంట్‌.  ఆస్కార్బిక్‌  ఆమ్లం లాటిన్‌ ‌పదమైన స్కార్బుటస్‌ (‌నుండి ఉద్భవించింది. స్కార్బుటస్‌ అం‌టే స్కర్వి  అనే వ్యాధికి పేరు. ఈ విటమిన్‌ ‌లోపం వల్ల స్కర్వి  అనే వ్యాధి సంభవిస్తుంది. పూర్వకాలంలో, ముఖ్యంగా  సుదీర్ఘ ప్రయాణాలు చేసే నావికులు ఎక్కువగా ఈ స్కర్వి  అనే వ్యాధితో బాధపడేవారు. ఈ వ్యాధికి ప్రధాన కారణం శరీరంలో ఫైబ్రోస్‌ ‌ప్రోటీన్‌   అసంపూర్ణంగా  కొల్లాజెన్‌ ‌సంశ్లేషణ కావడం. ఫలితంగా శరీర భాగాలు మందగించడం  మొదలవుతుంది. కొల్లాజెన్‌ ‌వాటిని సిమెంట్‌ ‌లాగ బంధించి  నిర్మాణాత్మక మద్దతును అందిస్తుంది. విటమిన్‌ ‘‌సి’ లోపించడం వల్ల కీళ్ల లో వుండే మృదులాస్థి  బలహీనపడుతుంది. అంతర్గత రక్త స్రావం, కండరాల బలహీనత, చిగుళ్ల సమస్యలు, రక్తం కారడం, దంతాలు  వదులు కావడం, కీళ్ల నొప్పి, మంట, వాయడం, గాయాలు నెమ్మదిగా నయంకావడం మొదలైనవన్నీ ఈ వ్యాధి లక్షణాలు.
పోర్చుగల్‌ ‌నుండి భారతదేశానికి సముద్రయానం ద్వారా బయలుదేరిన వాస్కోడగామా, 1497 లోనే సిట్రస్‌ ‌ఫలాల గురించి, వాటి ప్రభావం గురించి తెలుసుకున్నాడు. అందువల్ల పోర్చుగల్‌ ‌వారు పలుచోట్ల పండ్లు, కూరగాయలు తోటలను పెంచేవారు .  సముద్రయానంలో, మధ్యన ఆగే చోటు ఐన హనీఫ్‌ ‌హెలెనా  లో, స్కర్వి  మరియు ఇతర సముద్రయాన వ్యాధులతో  బాధపడే అనారోగ్య నావికులను సిట్రస్‌ ‌ఫలాలను తినడంకోసం, వ్యాధులనుండి కోలుకోవడం కోసం అక్కడ వదిలి వెళ్లేవారు. తర్వాత, తదుపరి ఓడ ద్వారా నావికులు వారిని ఇంటికి చేర్చేవారు. 1500  – 1800 మధ్యకాలంలో ఈ స్కర్వి  వ్యాధి కనీసం రెండు మిలియన్ల మందిని పొట్టనపెట్టుకుంది అని ఒక అంచనా. 1499 సంవత్సరంలో వాస్కోడగామా తన 170 మంది సిబ్బందిలో 116 మందిని, 1520 సంవత్సరంలో మాగెల్లాన్‌  230 ‌మందిలో 208 మందిని ప్రధానంగా స్కర్వి  వ్యాధి మూలంగా కోల్పోయారని జోనాథన్‌ ‌లనోబ్‌  ‌రాసాడు. దీనిని బట్టి  పురాతనకాలంలో సముద్రయానం అనేది ఎంత ప్రమాదకరంగా జరిగేదో మనం అంచనా వేయవచ్చు. అయితే  పాశ్యాత్య ఔషధ పితామహుడు  గా పిలువబడే హిప్పోక్రేటస్‌ (460 ‌దీ• – 380 దీ•) కూడా ఈ స్కర్వి వ్యాధి గురించి ప్రస్తావించడం వల్ల ఇది కొత్త వ్యాధి మాత్రం కాదని మనకు తెలుస్తుంది. కొన్ని సూచనల ప్రకారం, చరిత్ర పూర్వ యుగం  కు చెందిన కొన్ని స్థానిక సంఘాలు, స్కర్వి  చికిత్సకు మూలికలు వాడడం జరిగిందని తెలుస్తుంది.
శరీర నిర్మాణ ప్రక్రియలో, వ్యాధి నివారణలో కీలక పాత్రను పోషించే ఈ విటమిన్‌ ‘‌సి’ ని హంగరీయన్‌  ‌శాస్త్రవేత్త ఆల్బర్ట్ ‌స్జంట్‌ -‌స్టెంజ్‌ ‌గయిర్గి  (16 సెప్టెంబర్‌ 1893 – 22 అక్టోబర్‌ 1986) ‌కనుగొన్నాడు. 1937 సంవత్సరంలో శరీర ధర్మ శాస్త్రం / మెడిసిన్‌ ‌లో, సిట్రిక్‌ ఆమ్ల వలయానికి సంబంధించిన పరిశోధనలు చేసినందులకు గాను అతనికి నోబెల్‌ ‌బహుమతి లభించింది. అదే సంవత్సరంలో (1937) విటమిన్‌ ‘‌సి’ యొక్క  ప్రాముఖ్యతను, దాని రసాయన నిర్మాణాన్ని ఆవిష్కరించినందులకు వాల్టర్‌ ‌నార్మన్‌  అనే శాస్త్రవేత్తకు నోబెల్‌ ‌బహుమతి లభించింది. ఈ విధంగా ఒకే రసాయనిక సమ్మేళణంపై పరిశోధనలు గావించినందులకు, ఒకే సంవత్సరంలో రెండు నోబెల్‌ ‌బహుమతులు ఇవ్వడం ఒక గొప్ప విషయంగా భావించవచ్చు.
పూర్వం హెక్సురోనిక్‌ ఆమ్లం  గా  పిలవబడే  ఈ ఆస్కార్బిక్‌ ఆమ్లం, విటమిన్‌ ‘‌సి’, నీటిలో కరిగే, రుచికి పుల్లగా వుండే స్పటికాకార పదార్ధం. నీటిలో దీని అధిక ద్రావణీయత కారణంగా విటమిన్‌ ‘‌సి’ చిన్న పేగులో  సులభంగా శోషణ గావించి బడుతుంది.  ఇది రక్తం నుండి నేరుగా కాలేయానికి, అక్కడినుండి శరీర వివిధ భాగాలకు చేరుకుంటుంది. ఎక్కువైన / అధికంగా తీసుకున్న విటమిన్‌ ‘‌సి’ శరీరం నుండి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.
190 డిగ్రీల సెంటిగ్రేడు ద్రవీభవన  స్థానం వుండే విటమిన్‌ ‘‌సి’, అన్ని విటమిన్ల కంటే చాలా అస్తిరమైనది. విటమిన్‌ ‘ఏ’ ‌మరియు ఐరన్‌ ‌వంటి ఇతర పోషకాలతో విటమిన్‌ ‘‌సి’ ని తీసుకుంటే,  ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచి  ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది.  తాజా పండ్లు, కూరగాయలతో సహా అనేక సహజ వనరులలో విటమిన్‌ ‘‌సి’ సమృద్ధిగా లభిస్తుంది. గూస్‌ ‌బెర్రీ / ఉసిరి, సిట్రస్‌ ‌పండ్లు, ద్రాక్ష, నిమ్మ, టమాటా, బొప్పాయి, దానిమ్మ, బంగాళా దుంప, మిరియాలు, కివి, స్ట్రాబెర్రీ, ఆకుకూరలు, తృణ ధాన్యాలు మొదలైనవి  విటమిన్‌ ‘‌సి’ లభించే గొప్ప వనరులు.  కాంతాలోప్‌, ‌మామిడి, జామ, పుచ్చ కాయ, ఆపిల్‌, ‌బెర్రీస్‌,  ఆకుకూరలు మొదలైన వాటిలో విటమిన్‌ ‘‌సి’ విరివిగా లభిస్తుంది. పాలకూర, తాజా బఠాణీలు,  జాక్‌ ‌ఫ్రూట్‌, ‌టూర్నిప్‌, ‌పుదీనా, ముల్లంగి ఆకులు, మునగ, నల్ల ఎండు ద్రాక్ష, పాలు, బీట్‌ ‌రూట్‌, అమరాన్త్, ‌కొత్తిమీర, మిర్చి, బ్రోకలీ, కాళీ ఫ్లవర్‌, ‌స్వీట్‌ ‌పొటాటో, గుమ్మడి కాయలు  కూడా విటమిన్‌’‌సి’ కి మంచి వనరులుగా పరిగణించవచ్చు.   పాలు, గుడ్లు, మాంసం, చికెన్‌ ‌లలో చాలా తక్కువ పరిమాణంలో  విటమిన్‌ ‘‌సి’  లభిస్తుంది.  కొన్ని కొన్ని సార్లు  వీటిలో ఉండకపోవచ్చు కూడా.  విటమిన్‌ ‘‌సి’ ముఖ్యంగా అధిక పరిమాణంలో కాలేయం లో లభిస్తుంది.
మానవ శరీరం విటమిన్‌ ‘‌సి’ ని సంశ్లేషణం చేయక పోవడం వల్ల, కేవలం ఆహారం ద్వారా మాత్రమే లభిస్తుంది. విటమిన్‌ ‘‌సి’ కి సులభంగా ఆక్షీకరణ చెందే లక్షణం ఉండడం వల్ల  దీనిని ఏరోబిక్‌ ‌స్థితిలో నిల్వ చేయడం, కూరగాయలు కోయడం, వంట చేయడం వల్ల విటమిన్‌ ‘‌సి’ ఆక్సీకరణం చెందుతుంది. సగటున ఒక వ్యక్తికి రోజుకు 60 – 90 ఎస్త్ర విటమిన్‌ ‘‌సి’ అవసరమౌతుంది. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు అదనంగా 10 – 30 ఎస్త్ర లు అవసరమౌతుంది. ధూమపానం చేసే వారి రక్తం లో విటమిన్‌ ‘‌సి’ పరిమాణం, ధూమపానం చేయని వారితో పోలిస్తే 25% తక్కువ. కాబట్టి ధూమపానం, ఆల్కహాల్‌, ‌కెఫిన్‌ ‌తీసుకునే వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో విటమిన్‌ ‘‌సి’ అవసరమౌతుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడి  జ్వరం ఇన్ఫెక్షన్‌, ‌ప్రెగ్నన్సీ మరియు వృద్ధాప్యంలో వున్నవారికి విటమిన్‌ ‘‌సి’ ఎక్కువగా  అవసరమౌతుంది.
వివిధ ఆహారపదార్థాలలో లభించే విటమిన్‌ ‘‌సి’ / ఆస్కార్బిక్‌ ఆమ్లం ని కింది పట్టికలో సూచించడమైనది.  
ఆహారపదార్థం   లభించే ఆస్కార్బిక్‌ ఆమ్లం  (ఎస్త్ర/100)
ద్రాక్ష 200
క్యాబేజి 100
కాళ ఫ్లవర్‌ 70
‌పాలకూర 60
నారింజ 50
నిమ్మా 50
బంగాళా దుంప 30
బఠాణి 25
టమాటో 20
క్యారెట్‌ 06
ఆపిల్‌ 05
‌పాలు 2.1 నుండి 2.7
శారీరక కణాల  ఆక్షీకరణ కారణంగా ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. బేసి, జత చేయని ఎలక్ట్రాన్‌ ‌ల సంఖ్య  కలిగిన అణువులు, అణువుల సమూహాలను ఫ్రీ రాడికల్స్ అం‌టారు. ఇవి శరీరం ఫై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ‌పెరగడం వల్ల వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువవుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో  ఫ్రీ రాడికల్స్ ఏర్పడే ప్రక్రియ కూడా పెరుగుతుంది. వృద్ధాప్యంలో, శరీరంలో ఫ్రీ రాడికల్స్ ‌పెరగడం కారణంగా చర్మం ఫై ముడుతలు కనిపించడం, శరీర భాగాల పనితీరు సామర్థ్యం తగ్గుదల కనిపిస్తుంది.  విటమిన్‌ ‘‌సి’ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ‌తో  పోరాడుతుంది మరియు విటమిన్‌ ‘ఇ’ ‌ని తిరిగి సరఫరా చేయడంలో తోడ్పడుతుంది.    ఇది శరీరంలో ఐరన్‌ ‌శోషణ సామర్త్యాన్ని పెంపొందిస్తుంది మరియు అంటి ఎలర్జిక్‌, అం‌టి ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది.
డా. సి. హెచ్‌. ‌రమ్య శ్రీ ,  ప్రాక్టీసింగ్‌ ‌డెంటిస్ట్, ‌హనంకొండ, వరంగల్‌.

Leave a Reply