వ్యాక్సిన్ తీసుకున్న డా. మన్మోహన్ సింగ్
నిర్మలా సీతారామన్, కేజ్రీవాల్ ..
కొరోనా మహమ్మారి నియంత్రణా చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతోంది. రెండో దశ వ్యాక్సినేషన్ పక్రియలొ పలువురు ప్రముఖులు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ను ప్రధాని, రాష్ట్రపతితోపాటు పలువురు రాజకీయ నాయకులు తీసుకున్నారు. తాజాగా గురువారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు సతీమణి గురుశరణ్ కౌర్ కూడా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో ఇద్దరూ టీకా తీసుకున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కోవిడ్ టీకా తీసుకున్నారు. వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్లో ఆమె తొలి డోసు టీకా వేసుకున్నారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కూడా తొలి డోసు టీకాను తీసుకున్నారు. తీరత్ రామ్ షా హాస్పిటల్లో ఆయన ఆ టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోటి 66 లక్షల మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ కోవిడ్ వ్యాక్సిన్ తొలి మోతాదు తీసుకున్నారు. తనతోపాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఢిల్లీలోని ఎల్ఎన్జెపి హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా తొలిడోసు వ్యాక్సిన్‌ను జమ్మూలోని ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకున్నారు.