Take a fresh look at your lifestyle.

సీఎం కేసీఆర్‌ ‌దైవ సంకల్పానికి నిదర్శనం…

  • గొప్ప ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వైభవం యాదాద్రి
  • యాదాద్రి ఆలయ పున:ప్రతిష్ట స్వర్ణ గోపురం తాపడానికి కిలో బంగారం
  • సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరం కలిసి ఇవ్వనున్నట్లు ప్రకటించిన మంత్రి హరీష్‌ ‌రావు

తెలంగాణ అద్భుతమైన కళా శిల్పం, ఆధ్యాత్మిక వైభవం సీఎం కేసీఆర్‌ ‌దైవ సంకల్పానికి నిదర్శనం శ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయ పున: ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా  ఆలయ గోపురం స్వర్ణ తాపడంతో నిర్మాణం చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌  ‌చెప్పారు.  కేసీఆర్‌ ‌దైవ సంకల్పానికి గొప్ప నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు చెప్పారు. తెలంగాణ ప్రజలకు గొప్ప మహిమాన్వితమైన , పర్యాటక ప్రసిద్ధి క్షేత్రంగా విరాజిల్లే విధంగా యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం చేశారన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. ఇలాంటి గొప్ప దైవ సంకల్పం చారిత్రాత్మకం కావాలని సీఎం కేసీఆర్‌ ‌పున:ప్రతిష్టకు బంగారాన్ని కైంకర్యం చేస్తునట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరం కలిసి స్వర్ణ  గోపుర తాపడానికి కిలో బంగారాన్ని హరిష్‌ ‌రావు  ప్రకటించారు. ఈ గొప్ప పుణ్యకార్యక్రమానికి భాగస్వామ్యం కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆ స్వామి వారి అనుగ్రహం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్ధించారు.

Leave a Reply