Take a fresh look at your lifestyle.

రేపటి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

  • పోలింగ్‌ ‌సిబ్బందితో కలెక్టర్‌ ‌భేటీ
  • పోలింగ్‌ ‌నిర్వహణపై పలు సూచనలు

రేపు జరిగే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోటింగ్‌కు సర్వం సిద్ధమయింది. ఈ సందర్భంగా గురువారం పోలింగ్‌ ‌సిబ్బందితో జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ‌సమావేశమయ్యారు. రేపు జరుగనున్న ఉప ఎన్నిక పోలింగ్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. నేడు సామగ్రిని పోలింగ్‌ ‌స్టేషన్లకు అధికారులు తరలించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఏజెంట్లు, సిబ్బంది డబుల్‌ ‌డోస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వేసుకోవాలని.. కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలని ఆర్వీ కర్ణన్‌ ‌తెలిపారు. ఇదిలావుంటే హుజూరాబాద్‌ ఉప ఎన్నికను శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదికారి డాక్టర్‌ ‌శశాంక్‌ ‌గోయల్‌ ఇప్పటికే సూచించారు. ఆయన సూచనల మేరకుఅ అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ అన్నారు. ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

అన్ని పోలింగ్‌ ‌కేంద్రాల్లో హెల్త్ ‌డెస్కులు ఉండేలా చూడాలని అన్నారు. అన్ని పోలింగ్‌ ‌కేంద్రాల్లో వెబ్‌ ‌కాస్టింగ్‌, ‌వీడియోగ్రఫీ నిర్వహించాలన్నారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు నేడు హుజూరాబాద్‌ •స్ట్రిబ్యూషన్‌ ‌సెంటర్‌ ‌నుంచి పోలింగ్‌ ‌సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్‌ ‌కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. పోలింగ్‌ ‌రోజైన రేపు ఉదయం మొదటి మాక్‌ ‌పోలింగ్‌ ‌నిర్వహించి, పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో క్లియర్‌ ‌చేసి ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ‌ప్రారంభిస్తారని తెలిపారు. కోవిడ్‌ ‌నిబంధనలను కచ్చితంగా పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికను శాంతియుతంగా స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. సీపీ వి సత్యనారాయణ మాట్లాడుతూ..ఉప ఎన్నికకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 20 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని అన్నారు. వోటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా నివారించేందకు విజిలెన్స్ ‌టీమ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు.

Leave a Reply