Take a fresh look at your lifestyle.

ఆదివాసీల ఆర్థ్ధికాభివృద్ధ్దికి అందరూ కలిసి పనిచేయాలి

మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది
ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయితీలను తెలంగాణకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తా
ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు రెడ్‌‌క్రాస్‌ ‌ద్వారా సేవలు
ఆదివాసీలతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్‌ ‌తమిళిసై రాజన్‌

‌భద్రాచలం,ప్రజాతంత్ర,మే 17 :ఆదివాసిలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధిని సాధించడానికి అందరం కల్సి పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై  సౌందరరాజన్‌ ‌తెలిపారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని వీరబద్ర ఫంక్షన్‌ ‌హాలులో ఆదివాసీలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్‌ ‌పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆదివాసిల అభివృద్ధికి తన వంతుగా బైక్‌ అం‌బులెన్సులు, విద్యుత్‌ ఆటోలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆదివాసిల పిల్లల విద్యాభివృద్ధికి అదనపు తరగతి గదులు, అంగన్వాడి కేంద్రాలు నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసిల ఆర్ధిక ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో భాగంగా గిరిరాజా కోళ్లు, చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించుటలో పాలు పంచుకోవడం చాలా సంతోషమన చెప్పారు. ఆర్థికాభివృద్ధికి స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఆరోగ్య పరిరక్షణ చర్యలు గురించి ప్రస్తావిస్తూ ఒక గవర్నర్‌, ‌డాక్టర్‌ ‌గా్గ  సేవలు సంతృప్తి నిచ్చాయని చెప్పారు. అనీమియా, మలేరియా, మాల్‌ ‌న్యూట్రిషన్ల బారి నుండి ప్రజలను కాపాడేందుకు మెడికల్‌ ‌క్యాంపులు నిర్వహించాలని చెప్పారు.

ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామ పంచాయతీలు కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల మరియు ఏటపాక గ్రామాల ప్రజలు వారు పడుతున్న ఇబ్బందులను తెలియచేశారని, తెలంగాణలో కలిపేందుకు సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణకు సరిహద్దునున్న రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించుటలో భద్రాచలం ఏరియా హాస్పిటల్‌  ‌ప్రధానమైనదని, డాక్టర్లు, పారామెడికల్‌ ‌సిబ్బంది. పోస్టులు  ఖాలీగా ఉన్నాయని, భద్రాచలం శాసనసభ్యులు భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరగా భర్తీ చేయు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీ సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడకు పంపినందుకు దేవునికి ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణ చర్యల్లో రెడ్‌ ‌క్రాస్‌ ‌ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసిల అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, అయినప్పటికీ ఆదివాసిల జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పులు రాకపోవడానికి గల కారణాలపై అన్వేషణ చేస్తామని చెప్పారు. ఆదివాసిల జీవితాల్లో అసమానతల గొలుసులు తెంచడానికి మరియు సమాన అవకాశాలు కల్పనకోసం ప్రతి ఆదివాసి కృషి చేయాలని చెప్పారు. ఆదివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని, వారి జీవితాల్లో మార్పులు రావాలని, అభివృద్ధి చెందాలని, వారి జీవితాల్లో చిరునవ్వులు విరబూయాలని, మీ అభివృద్ధిలో నేను ఒకరిగా ఉంటానని చెప్పారు. ఆదివాసిల సమస్యల పరిష్కారం కోసం చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారని నిర్వాహకులను అభినందించారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ ‌నేను తమిళనాడు ఆడబిడ్డనని, తెలంగాణకు అక్కనని చెప్పారు. 5 గ్రామ పంచాయతిలు ఆంధ్రాలో ఉంటడం వల్ల పడుతున్న ఇబ్బందులు విన్న ఆమె చాలా బాధకలిగించాయని, సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ‌ప్రైవేట్‌ ‌కార్యదర్శి భవాని శంకర్‌, అదనపు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధుసూదన్‌ ‌రాజు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్‌ అధికారి సులోచనారాణి, గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, ఏపిఓ జనరల్‌ ‌డేవిడ్రరాజు, ఆర్డీఓ రత్నకళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాలో విలీనమైన ఐదు పంచాయితీలను తెలంగాణలో కలపాలి
రాష్ట్ర విభజనలో భద్రాచలంలో ఉన్న ఐదు పంచాయితీలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసారు. ఈ ఐదు పంచాయితీలను తెలంగాణకు తీసుకురావాలని భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య భద్రాచలం వీరభద్ర పంక్షన్‌ ‌హాల్‌ ‌లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై ముఖాముఖీ సమావేశంలో గవర్నర్‌ను కోరారు. అంతేకాకుండా పాండురంగాపురం నుండి భద్రాచలం వరకు రైల్వే లైను తీసుకురావాలని అలాగే  ప్రతీఏటా వరదలతో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కరకట్టను ఎత్తు పెంచాలని, ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని వినతిపత్రం అందచేసారు.  భద్రాచలం ఏరియా హాస్పిటల్‌ ‌లో  వసతులు పెంచి డాక్టర్లను నియమించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గవర్నర్‌  ‌మాట్లాడుతూ ఇక్కడి ఆదివాసీ ప్రజల సమస్యలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని చాలా బాధ  పడుతున్నానని అన్నారు.అంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరిన గిరిజనులకు గవర్నర్‌ ఇట్టి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు  తీసుకుంటానని హామి ఇచ్చారు. అనంతరం గవర్నర్‌ ‌తెలుగులో అందరూ బావున్నారా, అందరూ బావుండాలని సీతారామ చంద్రస్వామిని ప్రార్ధించినట్లు చెప్పారు.  తాను తమిళ ఆడబిడ్డనైనా   తెలంగాణ ప్రజలకు అక్కనని ఇక్కడి సమస్యలను అర్దం చేసుకున్నాను అని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆదివాసీలు సమస్య పరిష్కార  బాధ్యతలు అప్పగించారని, తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

పూర్ణకుంభంతో గవర్నర్‌కు స్వాగతం పలికిన అర్చకులు
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై • రాజన్‌కు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, ఆధికారులు  ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం,స్వామి వారి జ్ఞాపిక లడ్డు ప్రసాదం అర్చకులు అందచేసారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం అనంతరం స్వామి వారి దర్శనానికి విచ్చేసి క్యు లైన్‌ ‌లో ఉన్న భక్తులను  గవర్నర్‌ ‌పలకరించారు. ఆమె వెంట  ఈఓ రమాదేవి, ఆర్‌.‌డి. ఓ రత్న కళ్యాణి ఉన్నారు.

Leave a Reply