Take a fresh look at your lifestyle.

కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలి

  • భౌతిక దూరం పాటించాలి
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలనీ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. నర్సంపేటలో కరోనా కళకళంతో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా డీఎంహెచ్‌ఓ, ‌వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నర్సంపేట నియోజకవర్గంలో కరోనా వ్యాధి వ్యాప్తి, నమోదైన కేసుల వివరాలను తెలియజేస్తూ పాటించాల్సిన నివారణ చర్యల గురించి డీఎంహెచ్‌ఓ ‌మధుసూదన్‌ ఎమ్మెల్యే పెద్ది దృష్టికి తీసుకొచ్చారు. వ్యాధి వ్యాప్తి ప్రారంభ దశ నుండే అనేక జాగ్రత్తలు వహిస్తూ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా గ్రీన్‌ ‌జోన్‌గా కాపాడుకున్నామని ఆయన తెలిపారు. దేశమంతటా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుండి ఇక్కడి రావడం, వలసల ద్వారా, ఇంకా అనేక ఇతర కారణాల ద్వారా నియోజకవర్గానికి వచ్చిందని తెలిపారు. అనేక మంది నర్సంపేట నుండి కరోనా లక్షణాలతో పరీక్షల కోసం రోజూ ఎంజీఎంకు వస్తున్నారని, ఆ సంఖ్య ఈ మధ్య బాగా పెరగడం ఆందోళనకరమని అన్నారు. హైదరాబాద్‌ ‌నుండి వచ్చిన వ్యక్తి ద్వారా నెక్కొండ మండలంలో మొదటి పాజిటివ్‌ ‌కేసు నమోదు కాగా గడిచిన వారం రోజుల నుండి వ్యాధి లక్షణాలు ఎక్కువ మందిలో కనిపించడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టెస్టుల సంఖ్యను ముమ్మరం చేశామన్నారు.

ఇప్పటి వరకు ఒక్క నర్సంపేట పట్టణ పరిధిలోనే 11 కేసులు నమోదుకావడం భయాందోళన కలిగిస్తుందని, ఈ రెండు మూడు రోజుల నుండి రోజుకు మూడు నుండి నాలుగు కేసుల చొప్పున పాజిటివ్‌ ‌గా తేలుతున్నాయని, వారందరని క్వారంటైన్‌కు తరలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది తగు సూచనలు చేసామని చెప్పారు. జనాల్లో కొంత మేరకు కరోనా వ్యాధి పట్ల ఎలాంటి బయం లేకుండా వారిలో అశ్రద్ధ, అజాగ్రత్త కనిపిస్తుందని ఇలాంటి ప్రవర్తన ప్రమాదకరమని, ఇప్పటికీ కొంత మంది మాస్క్ ‌లేకుండా భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతూ వ్యాధి వ్యాప్తికి వాహకాలుగా మారుతున్నారని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రవర్తన అందరికి సమస్యను తెచ్చిపెడుతుందని అన్నారు. అంతేగాక ఎక్కడికెళ్లొచ్చిన తరచూ చేతులు కడుక్కోవడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలని అన్నారు. పోషక విలువలు ఉన్న ఆహారంతో పాటు సి విటమిన్‌ ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి కోవిడ్‌ ‌బారిన పడే అవకాశలు తక్కువగా ఉంటాయని, పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తుల్లో వారు తీసుకొనే మంచి ఆహారాన్ని బట్టే తిరిగి వెంటనే కొలుకుంటున్నారని తెలిపారు. వృద్ధులను, చిన్న పిల్లలను, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న వారిని వారికి సమీపంలో ఉంచరాదని కోరారు. నర్సంపేట పట్టణంలో పందులు, కుక్కల స్టైర్య విహారం ఎక్కువగా కనిపిస్తుందని తద్వారా సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుందని వాటిని కట్టడి చేయాలని స్థానిక మున్సిపల్‌ ‌శాఖను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే పాజిటివ్‌ ‌కేసులు నమోదైన ప్రాంతాల్లో తక్షణమే సానిటైజ్‌ ‌చేసి, కోరంటైన్‌ ‌సక్రమంగా పాటించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని,సంబంధితా వైద్య, పోలీస్‌, ‌మున్సిపల్‌, అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షలో నర్సంపేట మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌విద్యాధర్‌, ‌చైర్మన్‌ ‌గుంటి రజని కిషన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌మునిగాల వెంకట రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!