Take a fresh look at your lifestyle.

సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ మెలగాలి

అనంత ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి హితవు
అనంతపురం, : స్వీయ రక్షణ, జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. శుక్రవారం నగరంలోని జూనియర్‌ ‌కళాశాల మైదానంలో కూరగాయల మార్కెట్‌ను అనంతపురం మార్కెట్‌ ‌యార్డ్ ‌చైర్మన్‌ ‌ఫయాజ్‌, ‌కమిషనర్‌ ‌మూర్తితో కలిసి ఎమ్మెల్యే అనంత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ ‌బారిన పడకుండా ఉండాలంటే భౌతికదూరం పాటించాలన్నారు.

పాతూరు మార్కెట్‌లో జనం రద్దీ  ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌ను జూనియర్‌ ‌కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇక్కడ నిత్యం శానిటేషన్‌ ‌చేయించాలని కమిషనర్‌ ‌మూర్తికి సూచించారు. మార్కెట్‌కు వచ్చే వారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. వ్యాపారులు కుళ్లిన, చెడిపోయిన కూరగాయలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కూరగాయల కోసం వచ్చినప్పుడు జనం గుమిగూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి దుకాణదారుడిపై ఉందన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాల న్నారు. నగరంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.

నిత్యం శానిటైజ్‌ ‌చేసుకోవడం వల్ల వైరస్‌కు అడ్డుకట్టవేయవచ్చన్నారు. నిత్యం మార్కెట్‌ ‌సమయం ముగియగానే బ్లీచింగ్‌, ‌స్పెయ్రింగ్‌ ‌తప్పనిసరిగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ట్రాఫిక్‌ ‌డీఎస్పీ ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply