Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్‌ ‌రహిత జాతర కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి

Everyone , cooperate, non-plastic free, steel plates
జాతరలో ప్లాస్టిక్‌ను తొలగిస్తున్న సబ్‌ ‌రిజిస్ట్రార్‌, ‌విజిలెన్స్ అధికారి తస్లీమా

ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జరిగే మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతరను ప్లాస్టిక్‌ ‌రహిత జాతరగా జరుపుకోవడం కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ములుగు సబ్‌ ‌రిజిస్ట్రార్‌, ‌మేడారం విజిలెన్స్ అధికారి తస్లీమా మహ మ్మద్‌ ‌భక్తులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం మేడారం జాతర ప్రాంగణంలో విధులు నిర్వర్తించు తున్న తస్లీమా మద్యాహ్న సమ యంలో నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కోండనాగులు ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు 180 మంది మేడారం సందర్భన అనంతరం చెట్ల క్రింద భోజనం చేస్తుండగా అక్కడి చేరుకున్న తస్లీమా విద్యార్ధులందరు తమ వెంట స్టీల్‌ ‌ప్లెట్స్ ‌తెచ్చుకోని భోజనం చేస్తుండగా చూసి వారిని అభినందించారు.

ఈ సందర్బంగా ఆమే విద్యార్ధులతో మాట్లాడుతూ ప్లాస్టిక్‌ అనే భూతం ప్రాణాంతకమైనదని, భూమి మీద ఉండే జీవరాశులను నాశనం చేస్తుంద న్నారు. జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు తమ వంతుగా స్టీల్‌ ‌ప్లేట్స్ ‌తెచ్చుకోని భోజనాలు చేయ్యాలన్నారు. విద్యార్ధులకు జాతర విశిష్టతను గురించి వివరించారు. పక్కనే ఉన్న ప్లాస్టిక్‌ ‌వ్యర్ధాలను విద్యార్ధులతో కలిసి తీసేశారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరను ప్లాస్టిక్‌ ‌రహిత జాతరగా నిర్వహించడం కోసం పటిష్ట మైన చర్యలు తీసుకుంటుందని విద్యార్థులకు వివరించారు.

Tags: Everyone , cooperate, non-plastic free, steel plates

Leave a Reply