Take a fresh look at your lifestyle.

పట్టణ ప్రగతిని తమదేనని ప్రతి ఒక్కరు భావించాలి

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమముగా బావించరా దని ఇది ప్రజలందరు తమదేనని భావించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని 35,36,38,41,45 వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో బాగంగా స్పెషల్‌ ‌డ్రైవన్‌ను కలెక్టర్‌ ‌రవి, మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌శ్రావణితో కలిసి నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 36 వార్డులోని ప్రజల్లో ఉన్న చైతన్యం మరికొన్ని వార్డుల ప్రజలకు ఆధర్శం కావాలన్నారు. ఇక్కడి వార్డు ప్రజలు స్వచ్చందం గా చందాలు వేసుకొని సిసి కేమారాలను ఏర్పాటు చేసుకో వడం శుభపరిణామన్నారు. పట్టణ ప్రజలు మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాద్యతలను స్వీకిరంచాలన్నారు. ప్రభుత్వ సహకారంతో శ్మశాన వాటికలను అభివృద్ది చేస్తున్నామని ఇండ్లులేని నిరుపేదల కుటుంబాల అంత్యక్రి యల కోసం ఇక్కడే ఓక షెడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే ప్రజల, స్థానికుల సంరక్షణ కోసం సిసి కేమారాలను ఏర్పాటు చేసేందుకు కోటి రూపాయల నిధులు మంజూరి అయ్యా యని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ ‌రవి మాట్లాడుతూ పట్టణ ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు ప్రాదాన్యతను ఇస్తు చెత్తను రోడ్లపైన, మురికి కాలువల్లో వేయడం మానుకోవాలన్నారు.

దీంతో శానిటేషన్‌ ‌సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. ఇకనుంచి మురికి కాలువల్లో చెత్తను వేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని నిరంతరం మున్సిపల్‌ ‌సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఈవార్డు ప్రజలు ఏర్పాటు చేసుకొంటున్న సిసి కేమారాలతో అసాంఘిక శక్తులు, దొంగల నుంచి రక్షణతో పాటు చెత్తను మురికి కాలువల్లో వేసేవారిని కూడా గుర్తించే అవకాశం ఉందన్నారు. అనంతరం మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌శ్రావణి మాట్లాడుతూ ప్రతి ఓక్కరు తడిపొడి చెత్తను వేరుచేసి మున్సిపల్‌ ‌ట్రాక్టర్లు, అటోలలో వేయాల న్నారు. మురికి కాలువల్లో చెత్తను వేయడంతో కాలువల్లో ప్రవాహం అగిపోయి దొమలు తయారై వ్యాదులు సంక్రమి స్తాయని సూచించారు. ప్రతి ఓక్కరు తమ ఇంటిముందు బాద్యతగా మొక్కలను నాటి సంరక్షించాల్సిన అవసరం ఉందని చైర్మన్‌ ‌సూచించారు. ఈకార్యక్రమములో వైస్‌ ‌చైర్మన్‌ ‌గోలి శ్రీనివాస్‌, ‌కమీషనర్‌ ‌జయంత్‌రెడ్డి, తహశీల్దార్‌ ‌వెంకటేష్‌, ‌కౌన్సిలర్లు అడువాల జ్యోతి, కప్పల శ్రీకాంత్‌, అనుమల్ల జయశ్రీ, బొడ్ల జగదీశ్‌, ‌దాసరి లావణ్య, డిఈ లచ్చిరెడ్డి, వార్డుల స్పెషలాఫిసర్లు, ప్రజలు ఉన్నారు.

Leave a Reply