Take a fresh look at your lifestyle.

‌ప్రతీఒక్కరు గాంధీజీ అడుగు జాడల్లో నడవాలి : ఎస్పీ

Everybody should walk in the footsteps of Gandhiji SP

జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ‌పోలీస్‌ ‌కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్‌ ‌దత్‌ ‌మరియు జిల్లా పోలీసు అధికారులు అందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింస,శాంతి అనే ఆయుధాలతో బ్రిటిష్‌ ‌వారి బానిస సంకెళ్ల నుంచి మన దేశాన్ని విముక్తి పరిచిన గొప్ప యోధుడు అని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో అమరులైన అమరవీరుల ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఆపరేషన్స్ ‌రమణారెడ్డి, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ కృష్ణయ్య, భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర ఐపిఎస్‌, ‌ట్రైని ఐపీఎస్‌ ‌రోహిత్‌ ‌రాజు, కొత్తగూడెం డిఎస్పీ అలీ, ఇల్లందు డిఎస్పి రవీందర్‌ ‌రెడ్డి,మణుగూరు డిఎస్పి రామానుజం, పాల్వంచ డిఎస్పి కెఆర్కే ప్రసాద్‌, ఎస్‌ ‌బి ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు,రవి,డీసీఆర్బీ ఇన్స్పెక్టర్‌ ‌గురుస్వామి, పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు జిల్లాలోని పోలీసు అధికారులు,జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

Tags: Superintendent of Police office,Additional Superintendent of Police Operations Thanks, AR Additional SP

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply