Take a fresh look at your lifestyle.

కష్టాల్లో ఉన్న ప్రతి పేద వారిని ఆదుకుంటాం ఎమ్మెల్యే పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి

తాండూరు: కష్టాల్లో ఉన్న ప్రతి పేద వారిని ఆదుకుంటామని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. తాండూర్‌ ‌వెల్ఫేర్‌ ‌ఫారం ద్వారా నియోజకవర్గం పరిధిలోని 20 వేల పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఏ ‌మాట్లాడుతూ కొరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌ ‌డౌన్‌ ‌సందర్భంగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం చేయాలనే సంకల్పంతో పలు సంఘాలు, వ్యాపారవర్గాల నుండి స్వీకరించిన డబ్బుతో నియోజకవర్గ పరిధిలోని 20 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. తాండూరు పట్టణంతో పాటు నాలుగు మండలాల పరిధిలో పేద ప్రజలకు ఈ సరుకులను అందజేయడం జరుగుతుందని అన్నారు. వైరస్‌ ‌కట్టడికి వైద్య, పోలీసు, మున్సిపల్‌, ‌రెవెన్యూ సిబ్బంది తమ ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు సహాయం చేస్తున్నారని, వారి కృషి మరువలేనిదని కొనియాడారు. పాత్రికేయ మిత్రులు కూడా ఎప్పటికప్పుడు లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తమ ద ృష్టికి తీసుకొస్తున్నారని, వారు కూడా తమ ఆరోగ్యం పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు. అంతకు ముందు పలు సంఘాలు ఎమ్మెల్యేకు ఆర్యవైశ్య, గ్రెయిన్‌ అం‌డ్‌ ‌సీడ్స్‌తో పాటు పలు సంఘాల వారు తమ వంతు సహాయంగా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ ‌ఛైర్‌ ‌పర్సన్‌ ‌తాటికొండ స్వప్న, వైస్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌దీపా నర్సింహులు, కౌన్సిలర్‌ ‌మంకల్‌ ‌రాఘవేంధర్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ ‌రౌఫ్‌, ‌నాయకులు కరణం పురుషోత్తం, మురళీక ృష్ణ, ఆడ్వకేట్‌ ‌గోపాల్‌, ‌ఫోరం ప్రతినిధులు కుంచం మురళి, భగవాన్‌ ‌కరీం, రవీందర్‌ ‌రెడ్డి, సన్నీ అగ్రవాల్‌, ‌రాజేష్‌ ‌సోని, గోపాల్‌ ‌బాగరే తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!