Take a fresh look at your lifestyle.

‌ప్రతి పైసా లెక్క చూపాలి

Every paisa must be counted District Elections Commission Reviewers yusuf‌నాగర్‌కర్నూల్‌: ‌మున్సిపల్‌ ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని నాగర్‌ ‌కర్నూలు జిల్లా, ఎన్నికల కమిషన్‌ ‌వ్యయ పరిశీలకులు మహమ్మద్‌ ‌యూనుస్‌ ‌తెలిపారు. నాగర్‌ ‌కర్నూలు జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ ‌కల్వకుర్తి, కొల్లాపూర్‌ ‌మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచిం చారు. నాగర్‌ ‌కర్నూల్‌ ‌మున్సిపల్‌ ‌కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఎన్నికల నామినేషన్‌ ‌ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అభ్యర్థి నామినేషన్‌ ‌దాఖలు చేసిన రోజు నుండి ఎన్నికల ఖర్చులు చూపించాలన్నారు. లేనిపక్షంలో ఎన్నికల అధికారులు వారి ప్రచార వాహనాల అనుమతిని రద్దు చేస్తారని, మరోమారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారని చెప్పారు. అభ్యర్థులు 1 లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకునే అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు నామినేషన్‌ ‌వేసినప్ప టినుండి రోజువారీగా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మున్సిపల్‌ ‌కార్యాలయంలో ఎన్నికల తనిఖీ అదికారులకు సమర్పించాలన్నారు. విధిగా రెండుసార్లు ఎన్నికల వ్యయ నిర్వహణ రిజిస్టర్‌లను తనిఖీ చేయించుకోవాలని లేనిపక్షంలో ఐపీసీ సెక్షన్‌ 171 ఐ ‌ప్రకారం చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని ఆయన తెలి పారు. అభ్యర్థులు ప్రచారంలో పార్టీ కేటాయించిన నమూనా గుర్తు మాత్రమే ప్రదర్శించాలనీ, కరపత్రాలు, వాల్‌ ‌పోస్టర్లలో ముద్రణదారు పేరు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆలయాలు, ప్రార్థన మందిరాల వద్ద సమావేశాలు నిర్వహిం చవద్దన్నారు. సభలు, సమావేశాల నిర్వహణకు వాహనల బైకుల మరియు కార్లుకు ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల అధికారి తో అనుమతి పొందిన పత్రాలను ఆయా వాహనాల ముందు భాగంలో అందించాలని సూచించారు.

మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే పట్టణ ప్రజలు మరియు యువ ఓటర్లు 1950,08542 230200, 230201 నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. మున్సిపల్‌ ‌వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పక పాటించాలని, ప్రభుత్వ స్థలాలు, భవనాలపై ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు అతికించరాదన్నారు. గోడలపై ప్రచార రాతలు రాయవద్దన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దన్నారు. ప్రచారానికి వినియోగించిన ఖర్చుల లెక్కలను చూపించాలన్నారు. ఒకే అభ్యర్థికి సంబంధించి ఎవరు ప్రచారం నిర్వహించినా ఆ ఖర్చును సదరు అభ్యర్థి ఖర్చు కిందే పరిగణించాల్సి వస్తుందన్నారు. ప్రచార ఖర్చులు బ్యాంక్‌ ‌ఖాతా ద్వారానే తీసుకోవా లన్నారు. ఖర్చు 5 వేలకు మించితే చెక్కు ద్వారా మాత్రమే ఇవ్వాలని సూచించారు. పోలింగ్‌ ‌రోజు కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రశాంత వాతావ రణంలో ఎన్నికలు జరుగడానికి సహకరించాలని కోరారు. అలాగే ఎన్నికల తుది వ్యయాన్ని ఎన్నికల 45 రోజుల అనంతరం ఎన్నికల్లో నిర్వహించిన వ్యయ ఖర్చులను చూపించా లన్నారు. లేనిపక్షంలో ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను అనర్హులుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని జిల్లా వ్యయ పరిశీలకులు మొహమ్మద్‌ ‌యూనుస్‌ ‌పేర్కొన్నారు.

Tags: Every paisa, counted, District Elections, Commission Reviewers, yusuf, nagarkurnool

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply