Take a fresh look at your lifestyle.

‌ప్రతి క్షణం ఆనందమయం

ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్‌ ‌పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను, తల్లిదండ్రులకు పిల్లలను, తోబుట్టువులను, యువత లక్ష్యాలను, పిల్లల చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నాం చేసింది. కానీ వాటన్నింటిని ఎదుర్కోంటూ మనిషి ఇప్పుడిప్పుడే తిరిగి జీవన ప్రయాణాన్ని కొనసాగించడం ఆరంభించాడు. లాక్‌?‌డౌన్‌ అనంతరం కొరోనా భయం మనసులో ఉన్నప్పటికి జీవన పోరాటానికి సిద్ధమయ్యాడు. మహమ్మారి తన చెంతకు రాకుండా ఉండటానికి అవసరమైన పద్ధతులను పాటిస్తూ జీవిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆనందాన్ని మరచిపోకూడదు. కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా, ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

మనిషి జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం. ఎన్ని ఒత్తుడులు, సమస్యలు ఉన్నా.. వాటిని మరిచి ఆనందంగా జీవించాలి

సంతోషమే సంపూర్ణ బలం :
ఒకప్పటి మన తాతలు, అమ్మలు సంతోషమే సగం బలం అనేడి వారు కానీ ప్రస్తుతం సాంకేతికంగా అభివృద్ది చెందుతూ, ఆధునిక యుగంలో కాలంతో పాటు పడుతూ ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులల్లో సంతోషం అనేది కరువైపోయిందా అని అనిపిస్తుంది. అందుకేనోమే ప్రస్తుత పరిస్థితులలో సంతోషమే సంపూర్ణ బలం. జీవితం అత్యంత ముఖ్యమైనది. సంతోషంతోటే నిండు నూరేళ్లు. ఒక్క రోజులో ఉదయాన్నే నిద్ర లేచిన మొదలు ఆ రోజుకు ఏదోక అర్థం, సార్థకత, ప్రత్యేకత ఉండాల్సిందే. ప్రతి రోజులో నేను ఎలా గడిపాను అని విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. సంతోషంగా గడపడానికి ప్రతి రోజులో కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకోవాలి. ఈ సంతోష సమయం మిగిలిన సమయాన్ని కూడా సంతోషంగా జీవించడానికి దోహదం చేస్తుంది.ప్రతి పనిని అంకిత భావంతో పని చేయాలి. ప్రతి ఫలం సానుకూలంగా ఉన్నా, ఉండక పోయిన మన శక్తి సామర్ధ్యాల మేరకు ఇష్టంగా పని చేయాలి. ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాం. ఆ పని మంచిగా జరిగి ఫలితం బాగుంటే సంతోషమే కదా. సంతోషంగా ఉంటే నిండు నూరేల్లు జీవించే అవకాశం ఎక్కువ.

నలుగురితో కలసి మెలసి జీవించండి
నిండు నూరేళ్లు బ్రతుకుతామని నమ్మే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రతి రోజు ఒత్తిడితో జీవితం గడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిండు నూరేళ్లు జీవిస్తున్న వారిలో ఉన్న శక్తి ఏమిటి? మనకి కూడా నిండు నూరేళ్ల జీవితం సాధ్యమవుతుందా. ఎంతోమందికి సాధ్యమైంది మనకెందుక్కాదు. నలుగురితో కలసి మెలసి జీవించినంత మాత్రానా ఆయుష్షు పెరుగుతుందా? అవును సాధ్యమే అని సర్వేలు చెబుతున్నాయి. చుట్టూ ఉండే సమాజంతో మమేకమవుతూ, నలుగురితో కలిసిమెలిసి జీవించడం ద్వారా మన ఆయుర్దాయాన్ని కొన్నేళ్లపాటు పొడిగించుకోవచ్చు. కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇరుగుపొరుగు వారితో కలిసి పోవడం, మనకు తెలియకుండానే మనలో భద్రతాభావం, మానసిక సంతృప్తి ఏర్పడటం జరుగుతుంది. ఒంటరిగా కాలం వెళ్లదీసేవారి కంటే, నలుగురితో కలివిడిగా మాట్లాడుతూ కలిసి జీవించేవారి ఆయుర్దాయమే ఎక్కువే. మనం చేసేపని, మనం తినే ఆహారం, ఉపయోగించే వస్తువులతో పాటూ, తమ అలవాట్ల పట్లా చాలా సంతృప్తితో ఉన్న వారి ఆయుష్సు ఎక్కువగానే ఉంటోంది. ప్రతి విషయంలో ఒత్తిడి కలగడానికి ప్రధాన కారణం ఆ పనిలో సంతృప్తి కలగకపోవడమే. తృప్తి భావనతో ఉండటం వల్ల మానసిక ఒత్తిళ్లు చాలా వరకు దూరమైపోతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతట అవే సర్దుకుపోతాయి

రొటీన్‌ ‌కు భిన్నం
ప్రతి రోజు ఒకే టైం టేబుల్‌ . అయ్యో ఇంతేనా జీవితమంటే అని అనిపిస్తూ ఉంటుంది. జీవితం అంటే విసుగు వస్తోంది. జీవితం ఎప్పుడూ ఆసక్తిగా, ఉత్సాహంగా ఉండాలంటే..రోటిన్‌ ‌కు భిన్నంగా ఆలోచనలు మొదలు కావాల్సిందే. వారాంతపు సెలవులలో యాత్రలు, సముద్ర ప్రయానాలు, కొత్త కొత్త ప్రదేశాలను చూసి రావడం, కొత్త కొత్త అభిరుచుల్లో మునిగితేలడం లాంటివి చేస్తుండాలి.చిత్రలేఖనం, సంగీతం వంటి వాటితో కూడ సంతోష మయమైన జీవితాన్ని పొందవచ్చు. నవ్వించడం ఒక భోగం. నవ్వకపోవడం ఒక రోగం అన్న నానుడి తెలిసిందే. మనస్ఫూర్తిగా నవ్వుకోవడం వల్ల శరీరం అంతా ఆక్టివ్‌ ‌గా మారుతుంది. మనస్ఫూర్తిగా నవ్వితే చాలు ఒత్తిళ్లన్నీ పటాపంచలయితాయి.

తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఆనందం
సుఖదు:ఖాలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి. సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే సమయం వృథా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ప్రతి అంశాన్ని గుర్తుంచుకొని వాటిని ఉపయోగించుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. సృష్టిలో పనికి రానిదంటూ ఏదీ ఉండదు. మనం చూసే విధానంలోనే తేడా ఉంటుంది. ఎవరి సామర్థ్యంపై వారికి నమ్మకం ఉండాలి. ఇతరులపై ఆధారపడే విధానానికి స్వస్తి పలకాలి. తాము సంతోషంగా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్నవారినీ ఆనందంగా ఉంచాలి. తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. అందుకే కానుకలు, అభినందనలు, ఆశ్చర్యకర సందేశాల ద్వారా ఇతరులను సంతోష పెట్టేందుకు ప్రయత్నించాలి. అలాగే అవసరంలో ఉన్నవారికి సాయపడాలి. వారికి అవసరమైనప్పుడు ఆహారం లేదా నగదు ఇస్తే ప్రపంచంలో అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

సంతోషమే జీవితంగా మారాలంటే:
ప్రతి రోజు ఆక్టివ్‌ ‌గా ఉండవలెను.ఉరుకులు పరుగులు తగ్గించుకోవాలి. ప్రతి నిమిషాన్నీ సావధానంగానే గడపడానికి ప్రయత్నించాలి. ఏదైనా తినేటపుడు 20% కడుపులో వెలితిగా ఉంచాలి. కడుపులో 80% నిండే వరకూ మాత్రమే తినాలి. ఖాలీ సమయాన్ని మంచి మిత్రుల మధ్యలోనే గడపాలి. ప్రతి రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇతరుల పట్ల నవ్వుతూ, సద్భావంతో ఉండాలి. ఏ.సి. గదులలో కంటే నేచురల్‌ ‌గా ఉండే ప్రదేశంలో సమయంను గడపాలి. మనం ఇతరుల నుండి పొందే ప్రతి సాయానికీ వారికి థ్యాంక్స్ ‌చెప్పాలి. భూత, భవిష్యత్తులో కంటే వర్తమానంలో ఈ క్షణం లోనే జీవించాలి ఆలోచించాలి. సానుకూల ఆలోచనలతో సంతోషం. మనదగ్గరున్న దానితోటే సంతృప్తి చెందాలి. అందని దానిగురించి ఆలోచించడం ఆశించడం వల్ల భంగపాటు తప్పదు.ఇతరులతో సత్ససంబంధాలను కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని సీరియస్‌ ‌గా తీసుకోకూడదు. బాధ పడకూడదు.

డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి
రిహాబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, 9703935321

Leave a Reply