Take a fresh look at your lifestyle.

విశాఖ ఉక్కు పరిరక్షణకు మొక్కవోని సంకల్పం అవసరం

“తెలుగుల సంకల్ప బలానికి, ధైర్య సాహసాలకు, త్యాగాలకు ప్రతీకగా నిలచి సాధించిన విజయమే విశాఖ ఉక్కు. విశాఖలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం నిర్మించనున్నట్లు 1970 లో నాటి ప్రధాని చేసిన ప్రకటనతో నాటి అర్ధ దశాబ్దపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం చల్లారింది. ఉక్కు కర్మాగారం కోసం 32 మంది ప్రాణాలు హరించిన చితిమంటలే ఆ తరువాత విశాఖ ఫ్యాక్టరీలో ఉక్కును కరిగించేందు నిప్పులకొలిమై ప్రకాశించాయి.”

వివేకానందుడు చెప్పాడు ‘‘ప్రతి భారతీయ యువకునికి ఉక్కు సంకల్పం ఉండాల’’ని. వివేకానందుని బాటలో నడుస్తున్నామంటున్న భారత ప్రధాని మోదీ గారు చెబుతున్నారు ప్రభుత్వ రంగ సంస్థలొద్దని.. అందులో భాగంగానే చెప్పారు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వానికొద్దని. ‘పోరాడితే పోయేదేమీలేదు ఉక్కు సంకెళ్ళు తప్ప’ అని ఒక విప్లవ నినాదం ఎప్పుడూ యువతను జాగృత పరుస్తుంటుంది. ఇప్పుడూ ఆంధప్రదేశ్‌ ‌లో యువతకు తమ ముందుతరం త్యాగాల ఫలమైన విశాఖ ఉక్కు కాపాడుకోవాలని. ప్రజాస్వామ్యం పైరక్షణకు తిరుగుబాటు అనివార్యమనిపిస్తోంది .

1960 దశకంలో నాటి ఆంధప్రదేశ్‌ ‌లో ఉవ్వెత్తున లేచిన ఉక్కు ఉద్యమం, 32 మంది ప్రాణాల త్యాగ ఫలమైన ప్రభుత్వరంగ సంస్థగా రూపుదిద్దుకున్న రాష్ట్రీయ ఇస్పాత్‌ ‌నిగం లిమిటెడ్‌, ‌విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇప్పుడు భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నష్టాల పేరుతో చేతులు దులుపుకుని మూతకు సిద్ధంచేస్తూ వ్యక్తుల పరం చేయబోతున్న దుర్దినం ఆసన్నమైంది. రాష్ట్రానికి తలమానికమై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగసంస్థను నడి వీధిలో కేంద్రం అమ్మకానికి పెడుతుంటే చేతులు కట్టుకుని బతిమిలాడడం చూస్తుంటే రాష్ట్రపాలకులు ఇంత బలహీనులా, అశక్తులా, నిస్సత్తువ ఆవహించినవారా అనే అనుమానం ప్రతివారికీ కలుగుతుంది.

ఒకటి కాదు, రెండు కాదు దేశవ్యాప్తంగా ఆరు దశాబ్దాలుపైగా దీర్ఘ ఘన చరిత్ర, సమర్థత కలిగిన 439 భారీ ప్రభుత్వరంగ సంస్థల బాధ్యత వదిలించుకునే లక్ష్యంతో సాగుతున్న మోదీ ప్రభుత్వం బారినుంచీ ఇప్పుడు ఆంధప్రదేశ్‌ ‌లో వినిపిస్తున్న నిరసన ధ్వనులు విశాఖ ఉక్కును కాపాడుకునే సూచనలు ఈషణ్మాత్రమైనా కనిపించడం లేదు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఒడిషా లోని ఇనుప ఖనిజం గనులను విశాఖ ఉక్కుకు కేటాయించాలని, బ్యాంక్‌ ఋణాన్ని ఈక్విటీ గా మార్పు చేయాలని, ఉక్కు ఫ్యాక్టరీ మిగులు భూములని ప్రైవేట్‌ ‌కు విక్రయించి వచ్చిన సొమ్మును కర్మాగారం పెట్టుబడిగా స్థిరీకరించాలని జగన్‌ ‌నేతృత్వంలోని ఎపి ప్రభుత్వం చేస్తున్న సూచనలు కేవలం మొక్కుబడి వినతులే మినహా కేంద్రం నిర్ణయాన్ని మార్చలేవని, ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించలేవన్నది బహిరంగ సత్యమే. అంచలంచెల మోక్షం మాదిరి ఒకే సారి కాకుండా వాయిదాల పద్ధతిలో ప్రైవేట్‌ ‌పరం చేయాలన్న సలహా మినహా కర్మాగారాన్ని ప్రభుత్వ అధీనంలో నడపలేరన్నది అందరకూ తెలిసిన సంగతే.

దశాబ్దాలుగా భారీ లాభాలు ఆర్జించి, వేలాది కుటుంబాలకు ఉపాధికి, వ్యాపారానికి, నీడనిచ్చిన విశాఖ ఉక్కుకు సొంత గనులు లేక, ముడి ఖనిజాన్ని ఎక్కువధరకు కొనుగోలుచేసే స్థోమతలేక లాభాలు క్షీణించి, భారీ వడ్డీలకు అప్పుతెచ్చి నష్టాల బాట పట్టిందని చెప్పడం కేవలం, కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని వదిలించుకునేందుకే ప్రైవేట్‌ ‌వ్యక్తులకు అప్పగించడమన్న లక్ష్యం మినహా మరో కారణంకాదన్నది జగద్విదితమే.

- Advertisement -

ఇప్పుడు నష్టాపాలైందని చెబుతున్న విశాఖ ఉక్కు 2002 లో ఖాయిలాపడిన పరిశ్రమగా ఇండస్త్రియల్‌ ‌ఫైనాన్స్ ‌రీస్ట్రక్చరింగ్‌ ‌బోర్డ్ ‌వద్ద నమోదయినప్పటికీ, నిజానికి అప్పటినుంచీ నుంచి 13 సంవత్సరాలపాటు 2015 వరకూ సుదీర్ఘ కాలంలో భారీ లాభాలు ఆర్జించినమాట కాదనలేని వాస్తవం. శరవేగంతో విస్తరిస్తున్న నగర పరిధిలో ప్రస్తుతం కర్మాగారానికి ఉన్న 19,700 ఎకరాల భూమి విలువ గమనిస్తే లక్షకోట్ల రూపాయల పైమాటే. ఉక్కు కర్మాగారాన్ని వ్యక్తుల, ప్రైవేట్‌ ‌పరం కాకుండా ప్రభుత్వం కాపాడాలని కోట్లాది గొంతులు ప్రతిధ్వనిస్తున్నా.. రక్తపాతం లేకుండా ప్రభుత్వసంస్థ గొంతు పిసికే సాచివేత చర్యలనే రాష్ట్ర ప్రభుత్వం అవలంబించడం బహిరంగంగానే సాగుతున్నది. విశాఖ ఉక్కు ఒక్కటే కాదు, అనేక రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఎందుకని కేంద్రం ముందు ఏపి ప్రభుత్వం వెన్నెముకలేని విధంగా సాగిలపడి, అణగిమణగి ఉంటున్నదో అర్ధంకాని విషయం.

తెలుగుల సంకల్ప బలానికి, ధైర్య సాహసాలకు, త్యాగాలకు ప్రతీకగా నిలచి సాధించిన విజయమే విశాఖ ఉక్కు. విశాఖలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారం నిర్మించనున్నట్లు 1970 లో నాటి ప్రధాని చేసిన ప్రకటనతో నాటి అర్ధ దశాబ్దపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం చల్లారింది. ఉక్కు కర్మాగారం కోసం 32 మంది ప్రాణాలు హరించిన చితిమంటలే ఆ తరువాత విశాఖ ఫ్యాక్టరీలో ఉక్కును కరిగించేందు నిప్పులకొలిమై ప్రకాశించాయి. సమరయోధుల మార్గదర్శకత్వంలో వేలాదిమంది విద్యార్ధులు, యువకులు, కార్మికులు, వ్యాపారులు, రైతులు.. ఒకరేమిటి.. అన్ని వర్గాల ప్రతినిధులు కదం తొప్క్కి తీరం వెంబడి ఉక్కు కర్మాగారం తెచ్చుకున్నారు. కర్మాగారంకోసం 64 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి, 22 వేల ఎకరాల భూమి స్వాధీనపరచి దేశంలోని తీర ప్రాంతంలో తొలి ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసుకున్నారు.

తెలుగు ప్రజల తెంపరితనమేమిటో, ధైర్యం, సాహసం, సంస్కృతి, త్యాగమేంటో చాటిచెప్పారు ఆనాడే. దివంగత మాజీ ముఖ్య మంత్రి ఎన్‌ ‌టి రామారావుకు స్ఫూర్తినిచ్చిన ‘‘తెలుగు ఆత్మ గౌరవం’’ నినాదానికి బీజం వేసింది 1960 దశకం విశాఖ ఉక్కు అని చెప్పవచ్చు.

నేల నాలుగు చెరగులా విస్తరించిన ఆ తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలిగించి, త్యాగాలను నీరు కార్చే విధంగా ఆ ఘన చరిత్ర కలిగిన విశాఖ ఉక్కును నేడు కేంద్రం వదిలించుకునేందుకు నష్టాల బూచిని చూపుతూ ప్రజా సంపదను, శ్రమను, త్యాగాన్ని వ్యక్తులకు తాకట్టు పేట్టే ప్రయత్నం చేస్తుంటే నేడేమై పోతున్నది ఆ ఆత్మగౌరవం. అగ్నిపర్వతంలా జ్వలించ వలసిన తెలుగు తనం సాహసం, మూగనోము పట్టిందెందుకు. కేంద్రం దుశ్చర్యను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాధినేతలు రాజకీయ నాయకులు ఎందుకు చేతులు ముడుచుకుని, మౌనం పాటిస్తున్నారు. ఎందుకు ధిక్కార స్వరం వినిపించలేక పోతున్నారు.

తెలుగునేలకే వన్నె తెస్తూ నిత్యం ఉక్కును కరిగిస్తూ ప్రజ్వరిల్లుతున్న ఆ వెలుగు మంటలు ప్రైవేట్‌ ‌పరం కాకుండా కేంద్రం మెడలు వంచి, నిలబెట్టుకుని అర్ధ దశాబ్దం కిందటి త్యాగాలు వృధా కాకుండ కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తెలుగు వారిది.. ముఖ్యంగా ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వ సారధులదే.
-శామ్‌ ‌సుందర్‌

Leave a Reply