Take a fresh look at your lifestyle.

ప్రతి మానవతావాది స్పందించాలి..! -టీయూడబ్ల్యుజె నేత విరాహత్ అలీ

కరోనా విపత్కర పరిస్థితుల్లో చేతిలో పనిలేక, ఏ దిక్కులేకుండా ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకునేందుకు ప్రతి మానవతావాది స్పందించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ పిలుపు నిచ్చారు. ఆదివారం నాడు గజ్వేల్ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 50 మంది వికలాంగులకు, వృద్దులకు, ఏ దిక్కులేని నిరుపేదలకు బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్లు, పాలు, పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల మూలంగా నిరుపేదలు తమ ఆకలిని తీర్చుకోలేని నిస్సహాయక స్థితిలోకి నెట్టివేయబడ్డారని, ప్రతి మానవతావాది తనకు తోచిన సహకారం అందించి వారికి అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

సమాజంలో ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్థితులుండవని, ఇలాంటి సందర్భంలోనే మానవత్వాన్ని నిరూపించుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ ఎల్లారెడ్డి, జర్నలిస్టుల సంక్షేమ సొసైటీ అధ్యక్షులు ఏ.సురేందర్, ప్రధాన కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, ప్రతినిధులు నాయిని పెద్ద యాదగిరి, శంకర్, కిరణ్, లక్ష్మీ నారాయణ, నాగ వెంకట్ రెడ్డి, పులి బాలచంద్రం, సురేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

బీడీ కాలనీలో 40 కుటుంబాలకు:
ఛత్తీస్ ఘడ్ నుండి వలస వచ్చి చెవిలో జీవులు తీసుకుంటూ జీవనం సాగించే 40 కుటుంబాలు పని కరువై ఆకలితో అలమటిస్తున్న సందర్భంలో స్థానిక శేషమా గ్యాస్ ఏజెన్సీ సహకారంతో 100మందికి భోజనం పెట్టిన కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె నేత కె.విరాహత్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, చిన్నారులు, కువృద్దుల ఆకలి బాధలు చూసి ఆయన చలించి పోయారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నంబురి రామలింగేశ్వర రావు, 14వ, వార్డు కౌన్సిలర్ అల్వాల బాలేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply