Take a fresh look at your lifestyle.

‌ప్రతి రైతుకు మద్ధతు ధర రావాలి

  • సర్పంచ్‌లూ…రైతుకు సేవ చేయడమే  ప్రజాసేవా…  
  • ఏ రోజు టోకెన్లు…ఆ రోజే…
  • గజ్వేల్‌ ‌నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులతో..మంత్రి హరీష్‌రావు టెలీ కాన్ఫరెన్స్

గ్రామ సర్పంచ్‌ ‌సేవ చేయడమంటే.. రైతుకు సేవ చేయడమే. మీ గ్రామాల్లో ఉండేదే రైతులని, రైతులకు సేవ చేయడమే నిజమైన ప్రజా సేవ. ప్రతి రైతుకు మద్దతు ధర రావాలి. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా ప్రతి కొనుగోళ్ల కేంద్రంలో నీళ్లు, సబ్బు పెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే గ్రామ సర్పంచ్‌ ‌బాధ్యత, దీనిని ప్రతి సర్పంచ్‌ ‌పాటించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో కొరోనా నివారణ చర్యలు, ఉపాధి హామీ పథకం, పెండింగులో ఉన్న సిసి రోడ్లు, నర్సరీల నిర్వహణ, డంప్‌ ‌యార్డుల నిర్మాణం, శ్మశాన వాటికల నిర్మాణం, వరి, మక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు వాటి నిర్వహణపై 225 మందితో నియోజక వర్గ కేంద్రమైన గజ్వేల్‌ ‌సమీకృత కార్యాలయ భవనంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు టెలీ కాన్ఫరెన్స్ ‌సమీక్ష నిర్వహించారు. ఈ టెలీ కాన్షరెన్స్‌లో జెడ్పీ సీఈఓ శ్రవణ్‌, ‌డీఆర్డీఏ పీడీ గోపాల్‌ ‌రావు, డిపివో సురేశ్‌ ‌బాబు, ఎంపిడివోలు, నియోజక వర్గ పరిధిలోని అన్నీ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్‌ ‌చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ ‌మాట్లాడుతూ.. కొరోనా వ్యాధి నేపథ్యంలో ఉపాధి హామీ పథకం, పెండింగులో ఉన్న సీసీ రోడ్లు, నర్సరీల నిర్వహణ, డంప్‌ ‌యార్డుల నిర్మాణం, శ్మశాన వాటికల నిర్మాణం, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు వాటి నిర్వహణపై అధికారులకు ఆదేశాలు, ప్రజా ప్రతినిధులకు సూచనలను చేశారు.

ఏ రోజు టోకెన్లు ఆరోజే…
కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులకు ఇచ్చే టోకెన్లను ముందు రోజు సాయంత్రమే ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, రోజుకు సరాసరి 500 నుంచి 700 క్వింటాళ్లు ధాన్యం కొనుగోళ్లు చేయవచ్చని, ఒక్కరోజు కంటే ఎక్కువ టోకెన్లు జారీ చేయొద్దు. 4, 5 రోజులకు కలిపి ఒకేసారి టోకెన్లు ఇవ్వడం వల్ల వర్షం వచ్చినా, లారీలు రాకపోయినా, ఒక్కరోజు ధాన్యం అమ్మకాలు జరగకపోయినా ధాన్యం కొనుగోళ్ల కేంద్రంలోనే ఉండటంతో కొనుగోళ్ల కేంద్రంలో రైతులు గుమిగూడే అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామానికి ఒక కొనుగోళ్ల కేంద్ర ఏర్పాటు ఉన్న దరిమిలా ఏ రోజు టోకెన్లు ఆ రోజే ఇస్తే.. రైతులకు మేలు చేసిన వారమవుతామని వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ సర్పంచ్‌, ఎం‌పీటీసీ, రైతు బంధు సమితి సభ్యులతో సమన్వయంతో కలిసి పని చేస్తే ఏ కొనుగోళ్ల కేంద్రంలో కూడా రైతులు గుమిగూడకుండా ఉంటారన్నారు. రోజులో 50 మంది రైతులకు టోకెన్లు ఇస్తామంటే ఇబ్బందులు ఉంటాయని, ఉదాహరణకు ఓ రైతుకు 20 ఎకరాలు, మరో రైతుకు 10 ఏకరాలు, మరో రైతుకు అర ఏకరం పంట మాత్రమే ఉంటుందని, ఎంత క్వాంటీటీ, ఎంత మంది రైతులకు టోకెన్లు జారీ చేస్తున్నామనే అంశంపై సమన్వయం ఉండాలని సూచించారు. వీలైనంత వరకు చిన్న, సన్నకారు రైతుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు. కొనుగోళ్ల కేంద్రానికి వచ్చే రైతులు ఏ రైతుకు ఆ రైతు తమ వెంట ఎక్కువగా టార్ఫాలిన్‌ ‌కవర్లు తెచ్చుకోవాలని ప్రజా ప్రతినిధులు రైతులకు చెప్పాలని సూచించారు.

అకాల వర్షాలతో జాగ్రత్తగా ఉండాలి….
గజ్వేల్‌ ‌డివిజన్‌, ‌సిద్ధిపేట జిల్లాలో వడగళ్ల వాన, అకాల వర్షాలు ఉన్నాయని, పడుతుంటాయని కొనుగోళ్ల కేంద్రంలో ధాన్యం తడిసిపోకుండా ఉండాలంటే.. టార్ఫాలిన్‌ ‌కవర్లు తెచ్చుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని, ప్రధానంగా వరి కొనుగోళ్ల కేంద్రాల్లో లో తట్టు ప్రాంతం ఉంటుందని, దాంతో రైతుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్న దృష్ట్యా.. ఆ లోతట్టు ప్రాంతంలో ధాన్యం పోయకుండా చూడాలి. ఎత్తైన ప్రాంతంలో ధాన్యం పోయిస్తే.. వరద నీరు వచ్చినా అప్పటికప్పుడు డ్రైనేజీ కాలువ చేసి వరద నీటితో ఇబ్బందులు లేకుండా ఉంటుందని రైతులకు ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. వరి, మొక్కజొన్న, శనగలు, సన్‌ ‌ఫ్లవర్‌ ఈ ‌నాలుగు పంటలు కూడా ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందని, పంట కొనుగోళ్ల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూ.30 వేల కోట్ల రూపాయలు సమకూర్చారని మంత్రి పేర్కొన్నారు.

డబ్బులు, గోదాములకు ఇబ్బందుల్లేవు…
కొనుగోళ్లకు సంబంధించి డబ్బులకు, గోదాములకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కరోనా నేపథ్యంలో రైతులు ఒక్క చోట గుమిగూడద్దని, అందరూ ధాన్యం కొనుగోళ్ల కేంద్రానికి ఒకేసారి రావొద్దని, టోకెన్‌ ఇచ్చిన రైతులే వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. టోకెన్ల జారీకి ఒక పధ్ధతి పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వరి కోసిన రైతు ముందుగానే రిజిస్టర్‌ ‌చేయించుకోవాలని, ధాన్యం ఆరబెట్టాలని, పంట పొలాల వద్దనే – క్షేత్రస్థాయిలోనే తేమ శాతం సరిగ్గా ఉంటే రైతులకు టోకెన్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

60శాతం పూర్తయిన రేషన్‌….
‌రేషన్‌ ‌బియ్యం 12 కిలోలు అందజేసే కార్యక్రమం సిద్ధిపేట జిల్లాలో 60 శాతం పూర్తయ్యిందని, కొరోనా నేపథ్యంలో ప్రతి రేషన్‌ ‌షాపు వద్ద ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుని, సామాజిక దూరాన్ని పాటించేలా ఆయా గ్రామాలలోని ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఆచరణలోకి తేవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయ పంటలు పండించే రైతులకు తాత్కాలిక మార్కెట్లలో విక్రయాలు జరుపుకునేలా పాసులు జారీ చేశామని, హైదరాబాదు, వంటి మామిడి మార్కెట్‌, ‌గజ్వేల్‌ ‌మార్కెట్‌ అయినా.. ఎక్కడైనా తమ కూరగాయలు విక్రయాలు జరుపుకోవచ్చని, రైతులకు పాసులు కావాలంటే వ్యవసాయ శాఖ అధికారి, తహశీల్దారు, గడ ప్రత్యేకాధికారిని సంప్రదించాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం దుకాణాలు తెరిచే ఉంటాయని ఈ విషయంలో రైతులు ఇబ్బందులు పడకుండా వారికి అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

మండలానికో వైండింగ్‌ ‌దుకాణం తెరిపించాలె…
కాలి పోయిన మోటార్లతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట ఎండిపోతున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, ప్రతి మండలంలో ఒక వైడింగ్‌ ‌మరమ్మత్తు చేసే దుకాణాన్ని తెరిచే ఉండేలా ఆదేశాలు ఇచ్చామని, రైతులు సద్వినియోగం చేసుకునేలా ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్‌ ‌సోడియం హైపో క్లోరైడ్‌ ‌మందును నీళ్లలో కలిపి గ్రామాల్లో స్ప్రే చేయిస్తున్నారని, ఇప్పటికే చాలా గ్రామాల్లో చేశారని, ఇంకా ఏవైనా గ్రామాలు మిగిలి ఉంటే చేయించాలని సూచించారు.

మందగించిన శ్మశాన వాటిక నిర్మాణాలు…
కొరోనా దృష్ట్యా డంప్‌ ‌యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులు మందగించాయని, వాటిని వేగవంతం చేసి పనులు తొందరగా పూర్తి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్‌రావు సూచించారు. గ్రామంలో పూర్తయిన డంప్‌ ‌యార్డులను వాడకంలోకి తెచ్చి వర్మీ కంపోస్టు తయారీకి వాటిని వినియోగించేలా గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు చొరవ చూపాలని, పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని ఎంపిడివోలు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్‌ ‌వాడాలని ఎప్పటికప్పుడు ఆ గ్రామ సర్పంచ్‌, ‌ప్రజా ప్రతినిధులు గమనిస్తూ కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని సూచించారు.

రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులు ఈజీఎస్‌ ‌కూలీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడం, నర్సరీలను పక్కాగా నిర్వహించే తీరు తెన్నులు, డంప్‌ ‌యార్డుల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణం, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు వాటి నిర్వహణ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు, సూచనలు చేశారు. అన్నీ గ్రామాల్లో హైపో క్లోరైడ్‌ ‌స్ప్రే జరిగేలా చూడాలని, గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రజలు గుమిగుడకుండా ఉండేలా చొరవ చూపాలని ప్రజా ప్రతినిధులను మంత్రి కోరారు. అంతకు ముందుగా మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ‌గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీవో విజయేందర్‌ ‌రెడ్డి, మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజమౌళి, గడా వైద్యాధికారి కాశీనాథ్‌తో కలిసి గజ్వేల్‌లో కరోనా వైరస్‌ ‌వ్యాధి వ్యాప్తి, నివారణపై సమీక్షించారు.

Leave a Reply