Take a fresh look at your lifestyle.

ప్రతీ రైతుకూ.. రైతు బంధు అందిస్తాం

  • రైతును సంఘటితం చేయడమే కేసీఆర్‌ ‌లక్ష్యం
  • వానాకాలం రైతు బంధుకు రూ.7వేల కోట్లు
  • సంస్కరణలో సిద్దిపేట ఆదర్శం కావాలి : మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేటలోని భైరి అంజయ్య గార్డెన్‌ ‌లో వానా కాలం-2020 నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలకు, వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌ ‌రావు, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్‌ ‌కుమార్‌, ‌జెడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌రోజా శర్మ, కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి , ఎమ్మెల్సీలు రాఘోతం రెడ్డి, బొడకుంట వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ ‌రావు గారు మాట్లాడుతూ.. రైతు సంస్కరణ లో సిద్దిపేట ఆదర్శంగా కావాలి. సిద్దిపేట జిల్లా ఉద్యమంలో ఫస్టు.. అభివృద్ధిలో ఫస్టు.. వ్యవసాయ సంస్కరణల్లో కూడా ఫస్టు ఉండాలి.ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల మేలు కోసమే పని చేస్తుంది. సీఎం కేసిఆర్‌ ‌రాష్ట్రానికి ఒక తండ్రి లాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారు. రైతులను ఒక సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యం అన్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్‌, అం‌తర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా సాగు చేయాలి. రైతు బంధు పడమనేది ప్రభుత్వ ఉద్దేశం అసలే కాదు.. ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామన్నారు.వానాకాలం పంట కోసం రైతులకు రైతుబందు కోసం 7 వేల కోట్ల బడ్జెట్‌ ‌లో పెట్టాం అన్నారు. వానాకాలం లో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుంది. అందుకే ఇతర పంటలపై దృష్టి పెట్టాలన్నారు. యాసంగిలో వరి రాళ్ళ వాణతో నష్టం జరుగుతుంది… అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంట లో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కారు పని చేస్తుందనీ,ఇది రైతులపై బలవంతంగా రుద్దడం కాదన్నారు.కొత్త వంగడాలు వచ్చాయి… ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుంది.

ఆ తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేరుకోవచ్చు. సిద్దిపేట రిజర్వాయర్ల ఖిల్లా.. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకలను సంతరించుకుంటాయన్నారు.చెక్‌ ‌డ్యామ్‌ ‌లను ఒకరికొకటి షేక్‌ ‌హ్యాండ్‌ ఇచ్చుకునేలా నిర్మించాం.తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లు, రైతుబందు కొరత లేదు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తాం… ఎకరాకు 15 క్వింటాల్లా పంట వస్తదన్నారు.కరోనా తో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ‌ల తయారీ భారీగా పెరిగింది.పత్తికి డిమాండు ఎక్కువగా ఉంటుందనీ, రైతు సంక్షేమం కోసం, రైతు గౌరవం పెంచడం, రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రయత్నం అన్నారు.6.3 ఎంఎం పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్‌, ‌ధర ఉందనీ జిల్లాలో 9500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఫామయిల్‌ ‌సాగు ఎక్కువగా పండిస్తారు. దేశంలో సరిపడ ఫామయిల్‌ ఉత్పత్తి లేక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. జిల్లాలోనూ ఫామయిల్‌ ‌సాగు కు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి ని కోరా అని హరీష్‌ ‌తెలిపారు.కంది పంటను 5800 మద్దతు ధర తో ప్రభుత్వమే కొంటుంది. పంటల మార్పిడి ద్వారా రైతుకు దిగుబడి పెరిగి మేలు జరుగుతుందనీ, రైతుకు ఒక్క రూపాయి ఇవ్వని విపక్షాల మాటలు రైతులు విశ్వసిస్తారా ?ప్రతి రైతుకు రైతు బంధు రావాలి.. వారిలో మార్పు రావాలన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే, ప్రజలకు న్యాయం చేయలేని వాడు నాయకుడిగా ఫెయిల్‌ అయినట్లే అని హరీష్‌ ‌రావు అన్నారు.

Leave a Reply