Take a fresh look at your lifestyle.

‌ప్రతి ఉద్యోగి ఒక పిఆర్‌వో కావాలి

నేడు జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం

ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్‌లో ప్రపంచమే ఒక గ్రామంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వ, పబ్లిక్‌ ‌సెక్టార్‌, ‌కార్పొరెట్‌, ‌ప్రైవేట్‌ ‌రంగాలలో ప్రజా సంబంధాలు అత్యంత కీలక విభాగంగా మారబోతున్నాయి. ప్రజోపయోగ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, సంస్థ పట్ల ప్రజాభిప్రాయాన్ని సకరించి, సంక్షిప్తం చేసి సంస్థకు అందచేసే ప్రజా సంబంధాల అధికారి ఏ వ్యవస్థకైనా కళ్ళు, చెవులు లాంటి వాడు. నేటి పోటీ ప్రపంచంలో సంబంధిత ప్రజలకు సమాచారాన్ని స్పష్టంగా, సరళంగా అందచేసే ప్రజా సంబంధాల విభాగానికి నేడు అన్ని రంగంలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశంలో ప్రజాసంబంధాల ప్రాధాన్యతను గుర్తించిన పిఆర్‌ ‌మేనేజర్లు సంఘటితమై 1958లో ‘పబ్లిక్‌ ‌రిలేషన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ఇం‌డియా’ను స్థాపించారు. గత 58 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా పిఆర్‌ ‌వ్యవస్థ పటిష్టతకు నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ దాదాపు 37 ఆల్‌ ఇం‌డియా సెమినార్లు నిర్వహించింది.

ఏప్రిల్‌ 21, 1968 ‌భారత జాతీయ పిఆర్‌ ‌వ్యవస్థలో ఒక చారిత్రక దినం. నాడు న్యూడిల్లీలో జరిగిన జాతీయ సెమినార్‌లో పెరుగుతున్న పిఆర్‌ ‌వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తించిన నాటి పబ్లిక్‌ ‌రిలేషన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ఇం‌డియా జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ ‌సి.వి.నర్సింహ్మారెడ్డి ఏప్రిల్‌ 21‌వ తేదీని జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవంగా ప్రకటించారు. నాటి నుండి నేటి వరకు ఏప్రిల్‌ 21 ‌తేదీని జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవంగా పాటిస్తూ ప్రజా సంబంధాల అధికారులు అనేక శాఖల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా నేడు కమ్యూని•కేషన్‌ ‌విప్లవం నడుస్తుంది. ప్రింట్‌ ‌డియా, ఎలక్ట్రానిక్‌ ‌డియా, సోషల్‌ ‌డియా ఇలా ప్రచార మాధ్యమాల హవా కొనసాగుతుంది. కమ్యూనికేషన్‌ ‌నెట్‌వర్క్ ‌పరిపరివిధాలుగా విస్తరించిన సమయాన, సామాజిక, ఆర్థిక హోదాల భేదభావం లేకుండా ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థ చేరువయిన నేపథ్యంలో సంబంధిత సమాచారాన్ని నిర్దేశిత జన సమూహానికి చేరవేసే ప్రజా సంబంధాల విభాగం యొక్క ప్రాధాన్యత దినదినం విస్తరిస్తోంది.

ప్రజాసంబంధాల ఆవశ్యకతను, ప్రాధాన్యతలను గుర్తించి, పటిష్టమైన పిఆర్‌ ‌విభాగాన్ని ఏర్పరచుకున్న సంస్థలే విజయ పరంపరలో ముందుకెళ్తున్నాయి. నేడు విద్యా సంస్థలు, కార్పొరేట్‌ ‌సంస్థలు, ప్రైవేట్‌ ‌సెక్టార్‌, ‌ప్రైవేట్‌ ‌పరిశ్రమలు, పిఆర్‌వోలను నియమించుకోవడం తప్పనిసరి అవుతోంది. ప్రజా సంబంధాల విభాగాల విశేష ప్రాధాన్యతను గుర్తించి నేడు ప్రభుత్వాలు వివిధ శాఖల ద్వారా పిఆర్‌ ‌వ్యవస్థను బలోపేతం చెయ్యాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. వేల కోట్ల రూపాయల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వాలు, ఆయా కార్యక్రమాలు, పథకాలు వాటి లక్ష్యాలు ప్రజలకు చేరవేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి శాఖలో, ప్రతి విభాగంలో పిఆర్‌ ‌వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. మారుమూల గ్రాణ ప్రజలకు సైతం అన్ని కమ్యూనికేషన్ల వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న స్థితిలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా సమాచార ప్రసార, పౌర సంబంధాల విభాగంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

సమాచార శాఖ ద్వారా ప్రసారం, ప్రచారం చేసే కార్యక్రమాల్లో మూస పద్ధతులకు స్వస్తి పలికి ప్రచారంలో ఆధునికతను సంతరించుకోవాల్సిన సమయం ఏర్పడుతోంది. లక్షల కోట్ల బడ్జెట్‌తో ముందుకెళ్తున్న ప్రభుత్వాలు ప్రజాసంక్షే•మ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు చేరవేసే ప్రజా సంబంధాల విభాగానికి ప్రతి శాఖలో సముచిత నిధులు కేటాయించాలి. సమాచార శాఖ అంటే కేవలం డియా ప్రతినిధులతో సమన్వయం చేసే విభాగంలా కాకుండా ప్రజలకు సరైన సమాచారాన్ని సమగ్రంగా అందచేసే వ్యవస్థగా తీర్చిదిద్దాలి.

కేవలం సమాచారశాఖ ఉద్యోగులు, ఆయా శాఖల ప్రజా సంబంధాల అధికారులు మాత్రమే ప్రచార కార్యక్రమాలు చూస్తారనే భావన పోవాలి. ప్రతి శాఖలో ప్రతి ఉద్యోగి, ఐఎఎస్‌ ‌నుంచి అటెండర్‌ ‌వరకు సమాచార సంబంధాల అధికారిగా మారాలి. ఆయా శాఖల సమాచారం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రతి ఉద్యోగికి ప్రజా సంబంధాలపై శిక్షణ ఇప్పించాలి. ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రతి మంత్రికి, ముఖ్య కార్యదర్శులకు జిల్లా కలెక్టర్లకు, ఆంతరంగిక కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులు ఎంత ముఖ్యమో ప్రజా సంబంధాల అధికారి కూడా అంతే ముఖ్యమని భావించి అధికారికంగా ప్రజా సంబంధాల అధికారిని నియమించాలి.

పత్రికా రంగం, టివి చానెళ్ళు విస్తరించి మండల స్థాయిలో విలేఖరులను నియమించుకుంటున్న నేపథ్యంలో ప్రతి మండలంలో, గ్రామ స్థాయిలో ప్రతి ముఖ్యమైన శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికి సమాచార పౌర సంబంధాలపై శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే ప్రతి మండల రెవెన్యూ కార్యాలయంలో, ప్రతి పోలీస్‌ ‌స్టేషన్లో ప్రజా సంబంధాల విభాగాన్ని నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల కొరకు ప్రజల వరకు ప్రభుత్వం వెళ్ళాలంటే ప్రజా సంబంధాల విభాగ పటిష్టత ఒక్కటే మార్గం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేసే మంచి ప్రజా సంబంధాల విభాగాన్ని నిర్మించుకోవడం ద్వారానే ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కాగలదు.
– సురేష్‌ ‌కాలేరు సహాయ ప్రజా సంబంధాల అధికారి, తెలంగాణా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, 9866174474

Leave a Reply