Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌తో నిత్య కూలీలకు కష్టాలు

  • పనులు దొరకక సొంతూళ్లకు పయనం
  • రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినకన యాత్ర

ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పని చేయనిదే పూట గడవని వారికి శరాఘాతంగా మారింది. దీంతో వారంతా ఇంటి బాట పడుతున్నారు. పిల్లాపాపలతో బయలుదేరుతున్నారు. రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వందల కిలో టర్ల మేర కాలినడన బయలుదేరుతున్నారు.హైదరాబాద్‌ ‌నుంచి నారాయణఖేడ్‌ ‌మూటా ముల్లెతో వలస కూలీలు ఇంటిబాట పట్టారు. ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి చిన్నారులు సైతం కదిలారు.. ఆకలి.. దప్పికతో అలమటిస్తూ.. అడుగు తీసి అడుగు వేయలేని దయనీయ పరిస్థితి వారిది. గమ్యం చేరడమే లక్ష్యంగా.. వందల కిలో టర్ల మేర నడుస్తూ నరకయాతన అనుభవించారు. ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి హైదరాబాద్‌ ‌నుంచి కాలినడన వెళుతున్న నారాయణఖేడ్‌ ‌చిన్నారులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, ‌బిచ్కుంద, పెద్దశంకరంపేట, కంగ్టికి చెందిన వలస కూలీలు హైదరాబాద్‌ ‌కూకట్‌పల్లి, మియాపూర్‌, ‌రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌విధించడం.. మూడు రోజులుగా పనులు లేకపోవటంతో తమ సొంత ఊర్లకు కాలినడకన బయలుదేరారు. 150 కిలో టర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలకు ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టిన నడక.. మధ్యాహ్నం వరకు సంగారెడ్డికి చేరుకుంది. రోడ్డుపై చిన్న పిల్లలు సైతం మాస్కులు ధరించి భారమైన అడుగులు వేస్తూ నడవడం చూపరులను కలచివేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌ ‌రెడ్డి, టౌన్‌ ‌సీఐ వెంకటేశం, రూరల్‌ ఎస్‌ఐ శ్రీ‌కాంత్‌ ‌వారికి ఆహారం అందించారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి సురక్షితంగా వారి ఊర్లకు పంపించారు. ఈ సందర్భంగా ఆపత్కాలంలో ఆదుకున్న పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy