Take a fresh look at your lifestyle.

ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో ధరల పెంపు

  • కేంద్రం తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌
  • ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఆందోళన
  • రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో పట్టపగలే దోపిడి చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ

ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు తగ్గితే దేశంలో కరోనా కష్టకాలంలో మాత్రం కేంద్రం విపరీతంగా ధరలు పెంచడంపై కాంగ్రెస్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేసింది. పెట్రోదరలకు నిరసనగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్వనలు జరిపారు. ఇబ్రహింపట్నంలో జరిగిన ఆందోళనలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి,మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపుపై నిరసన తెలిపామని, కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఒక్క బ్యారల్‌ ‌ధర 40 డాలర్లు ఉండేదని, అప్పుడు పెట్రోల్‌ ‌ధర రూ. 30, డీజిల్‌ ‌ధర రూ. 25 మాత్రమే ఉండేదని ఉత్తమ్‌ అన్నారు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్లో 40 దాలర్లే ఉందని, అయినా ధర రూ. 80 రూపాయలు మించిందని, ఎక్సైజ్‌ ‌సుంకాన్ని మోడీ ప్రభుత్వం 20 సార్లు పెంచిందని, రూ. 18 లక్షల కోట్లు రాబట్టుకుందని ఉత్తమ్‌ ‌విమర్శించారు. 6న అన్ని జిల్లా, నియోజక వర్గ కేంద్రాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌లో విద్యుత్‌ ‌బిల్లులను రద్దు చేయాలని నిరసన తెలుపుతామన్నారు. ఇకపోతే తెలంగాణ ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే అని, ప్రాజెక్టుల పేరుతో లూటీ జరుగుతోందని మండిపడ్డారు. పనుల్లో నాణ్యతలేదని, సీఎం ఫామ్‌ ‌హౌస్‌ ‌గేటుకు అనుకునే తెగిన కాలువ ఉందని, కాలువలు తెగుతాయి అనడానికి అధికారులకు సిగ్గుండాలన్నారు. ఇందుకు కారణమైన చీఫ్‌ ఇం‌జనీర్‌ను ఈఎన్సీ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ ‌చేయాలని, అతనిపై క్రిమినల్‌ ‌కేసు పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రాజెక్టు పనులను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఉపేందర్‌ ‌రెడ్డికి సబ్‌ ‌కాంట్రాక్ట్ ఇచ్చారని ఉత్తమ్‌ ‌విమర్శించారు. ప్రాజెక్టు
పనుల నాణ్యత లోపాలపై అన్ని కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. రూ. 2600 కోట్ల దుమ్ముగూడెం ప్రాజెక్టు టెండర్లో కూడా మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌జరిగిందని ఉత్తమ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

పట్టపగలు దోపిడీ జరుగు తోందని, చీఫ్‌ ‌సెక్రటరీ కి లేఖ రాశామని, స్పందించక పోతే ఆయన పాత్ర కూడా అందని భావించాల్సి ఉంటుందని ఉత్తమ్‌ అన్నారు. మెడిగడ్డ బ్యారేజి పనులను ఎల్‌ అం‌డ్‌ ‌టీకి రూ. 2591కోట్లకు ఇచ్చారని, ఆ తర్వాత ప్రాజెక్టు అంచనాలను రూ. 4583 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ప్రతిమ కంపెనీకి రూ. 10 వేల కోట్ల పనులు ఇచ్చారని, 2014 వరకు ప్రతిమ కంపెనీ ఒక్క ప్రాజెక్టు పని కూడా చేయలేదన్నారు. మురళీధర్‌ ‌రావు 7 ఏళ్లుగా పదవి ముగిసినా ఈఎన్సీగా కొనసాగుతున్నాడని, అతను కేసీఆర్‌ ‌బంధువు అని, ప్రాజెక్టుల పేరిట దోచిపెడుతున్నాడని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు కనీస నాణ్యత లేకుండా నిర్మాణం చేశారన్నారు. పట్టపగలు దోపిడీ జరుగుతోందని, చీఫ్‌ ‌సెక్రటరీకి లేఖ రాశామని, స్పందించక పోతే ఆయన పాత్ర కూడా అందని భావించాల్సి ఉంటుందని ఉత్తమ్‌ అన్నారు. మెడిగడ్డ బ్యారేజి పనులను ఎల్‌ అం‌డ్‌ ‌టీకి రూ. 2591కోట్లకు ఇచ్చారని, ఆ తర్వాత ప్రాజెక్టు అంచనాలను రూ. 4583 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ప్రతిమ కంపెనీకి రూ. 10 వేల కోట్ల పనులు ఇచ్చారని, 2014 వరకు ప్రతిమ కంపెనీ ఒక్క ప్రాజెక్టు పని కూడా చేయలేదన్నారు. పార్టీ మారినందుకు కందాళకు ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు కాంట్రాక్టులు అప్పగించారనేందుకు కొండపోచమ్మ సాగర్‌ ‌నిదర్శనమని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. టీఆరెస్‌ ‌నేతలందరూ రాష్ట్ర వనరులు దోచుకుంటున్నారని, వారిపై క్విట్‌ ‌ప్రోకో కింద కేసు పెట్టాలన్నారు. నేతలను ప్రలోభాలకు గురిచేసారని ఆరోపణలు ఉన్నాయన్నారు. విజిలెన్స్ ‌విచారణ జరగాలన్నారు. డబ్బులకు ఆశపడి కాంగ్రెస్‌ ‌లో గెలిచి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌ ‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ‌లోకి వెళ్లారని నిరూపణ అయిందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. ఇరిగేషన్‌-‌వాటర్‌ ‌వర్క్ ‌లో నాణ్యత లేని పనులు జరిగాయన్నారు. ఇరిగేషన్‌ ‌పై కాంగ్రెస్‌ ‌పార్టీ లీగల్‌ ‌గా పోరాటం చేస్తుందని చెప్పారు.

Leave a Reply