Take a fresh look at your lifestyle.

వరంగల్‌ ‌జైలు నుంచి ఖైదీల తరలింపు

  • రాష్ట్రంలోని వివిద జైళ్లకు తరలివెళ్లిన ఖైదీలు
  • పటిష్ట భద్రత మధ్య తరలింపు కార్యక్రమం

వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలు నుంచి ఖైదీల తరలింపు పక్రియ ప్రారంభమైంది. ప్రత్యేక బస్సులు, ఎస్కార్ట్, ‌సాయుధ సిబ్బంది ఇప్పటికే జైలుకు చేరుకున్నారు. మొదటి విడతగా 119 మంది ఖైదీలను హైదరాబాద్‌ ‌చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీరిని తరలించే కార్యక్రమం చేపట్టారు. వీరిలో 80 మంది పురుషులు, 39 మహిళా ఖైదీలు ఉన్నారు. ఖైదీల తరలింపు పక్రియను జైళ్ళశాఖ డీజీ రాజీవ్‌ ‌త్రివేది స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

అయితే ఇక్కడి జైలును రాష్ట్రంలోని వివిధ జైళ్లకు తరలిస్తున్నారు. కేంద్ర కారాగారం స్థలాన్ని , వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. జైలు ప్రాంతంలో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జైలు స్థలంలో ఎంజీఎంను తరలించి మల్టీ సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజీ సూచనలతో వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైల్లో ఉన్న 960 మంది ఖైదీలను రాష్ట్రంలోని వివిధ జైలుకు అధికారులు తరలించనున్నారు. అనంతరం స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్వాధీనం చేసుకోనుంది.ఇటీవల సిఎం కెసిఆర్‌ ‌జైలు సందర్శించి దానిని తరలించనున్నట్లు ప్రకటించారు.

Leave a Reply