Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌లో ఈటలదే గెలుపు

  • సిఎం కెసిఆర్‌కు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది
  • వోట్లు పడయని తెలిసి డబ్బులు పంచుతున్నారు
  • వరి కొనేది కేంద్రం అయితే బెదిరింపులు ఎందుకో
  • రైతులను బెదిరిస్తున్న కలెక్టర్లపై చర్య తీసుకోవాలి
  • హుజూరాబాద్‌ ‌ప్రచారంలో బిజెపి నేత బండి సంజయ్‌

హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ ‌భారీ మెజార్టీతో గెలవబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. వారు ఎంతగా ప్రచారం చేసినా, తలకిందులు తపస్సు చేసినా టిఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమని అన్నారు. అందుకే బుధవారం పొద్దటి నుంచి హుజురాబాద్‌లో వోటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఎన్ని మాయమాటలు చెప్పినా ఈటలను ఓడించడం అసాధ్యమని తేలిపోయిందన్నారు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని..అయితే కేసీఆర్‌కు వొచ్చిన ఇబ్బందేంటో చెప్పాలన్నారు. కావాలనే వరి పండించవద్దని రైతులను బెదరిస్తున్నారని సంజయ్‌ అన్నారు.. వరి కావాలా.. ఉరి కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. వరి కావాలంటే బీజేపీకి వోటెయ్యాలన్నారు. కేసీఆర్‌ ‌వడ్లు ఎట్ల కొనడో చూస్తామన్నారు. బుధవారం హుజురాబాద్‌లో వి•డియాతో బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..కెసిఆర్‌ ‌కల్లబొల్లి కబుర్లు విని నమ్మే రోజులు పోయాయని అన్నారు. రైతుల పాలిట తాలిబన్‌ ‌సీఎం కేసీఆర్‌ అని బండి సంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు.

తన ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ ‌టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రతి వోటర్‌కు 20 వేల రూపాయలు ఇచ్చిందని, అయితే 15 వేల రూపాయలను ఆ పార్టీ కార్యకర్తలే మధ్యలోనే దొబ్బేసారన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కాష్‌ను నమ్ముకుందని, కాలిబర్‌, ‌క్యారెక్టర్‌ను నమ్ముకున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ ‌పేరుతో ఫేక్‌ ‌లెటర్‌ ‌క్రియేట్‌ ‌చేశారని, కానీ వారి గోతిలో వారే పడ్డారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వోటు వేస్తే ఉరి వేసుకున్నట్లేనని పేర్కొన్నారు. సిద్ధిపేట, ఖమ్మం కలెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని, తాము కూడా లీగల్‌గా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనకపోతే కొనిపిస్తామని, కొనేది కేంద్రం.. వీళ్లు చేసేది బ్రోకరిజం మాత్రమేనన్నారు. విజ్ఞతతో వోటు వేసి కేసీఆర్‌కి బుద్ధి చెప్పాలని కోరుతున్నానని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో జోక్‌ ‌కాదు..హరీష్‌ ‌రావు జోకర్‌ అన్నారు.

కేసీఆర్‌ది డ్రామా కంపెనీ అని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. అమరవీరులను కేసీఆర్‌ ‌రోడ్డున పడేశారని విమర్శించారు. ఏడేళ్లుగా ఏం చేయని కేసీఆర్‌కు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. ఈటలను గెలిపిస్తే తెలంగాణ పరువు నిలబడుతుందన్నారు. హుజురాబాద్‌ ‌నియోజకవర్గం కమలాపూర్‌ ‌మండల కేంద్రంలో విజయశాంతి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ‌తరపున హుజురాబాద్‌ ‌మండలం కాట్రపల్లిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్‌ ‌వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ అహంకారం తగ్గాలంటే.. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు. ఫామ్‌ ‌హౌస్‌లో పడుకొని..కవి•షన్లు దండుకోవడమే కేసీఆర్‌ ‌పనిగా పెట్టుకున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ‌వోటుకు ఆరువేలు పంచుతుందని వివేక్‌ ఆరోపించారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామంటే కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో కెసిఆర్‌కు గుణపాఠం చెప్పి ఈటలను గెలిపించాలని, అప్పుడే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందన్నారు.

Leave a Reply