Take a fresh look at your lifestyle.

ఈటల వైపు నిలబడి సత్తాచాటిన హుజురాబాద్‌ వోటర్లు

తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌) ‌ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో ఓటమికి కర్ణుని చావుకి ఉన్నన్ని కారణాలు ఉన్నవి. క్యాబినెట్‌ ‌నుండి ఈటలను తొలగించిన విదానం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనేక వర్గాలు విస్మయం వ్యక్తం చేశారు. దాంతో ఆయనకు సానుభూతి వచ్చింది. వెల్లువలా వచ్చిన సానుభూతిని కట్టడి చేయడానికి టి.ఆర్‌.ఎస్‌. ‌రంగంలోకి దిగి ఈ నియోజకవర్గంలో నష్టనివారణ చర్యలు చేపట్టింది.  అందులో భాగంగా పార్టీ క్యాడర్‌ను నిలువరించడంకొసం వారికి లక్షలకు లక్షలు ఎరవేసింది.  వాస్తవంగా ఆపని మొదలు చేసింది ఈటలే.. అయిన అధికార పార్టీ పై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇతర నియోజక వర్గాల నుండి మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంచార్జిలుగా పెట్టింది వాళ్ళు  వాళ్ళ అనుమాయులను 100 మందికి ఒకరుగా పెట్టి పెద్ద ఎత్తున ఆర్బాటం చేశారు. దాంతో స్థానికనాయకులు అంటిముట్టనట్టుగా ఉండగా, బయటినుండి వచ్చిన వాళ్ళు విహారయాత్రలకు వచ్చినట్లుగానే వారి వ్యవహారశైలి కనిపించింది. ఈ విషయములో ప్రచారం ఎక్కువై పనితక్కువైంది అధిష్టానం, మంత్రి హరీష్‌ ‌రావు తీసుకున్నంత సీరియస్‌గా పార్టీ శ్రేణులు తీసుకోలేదు. తమ పార్టీ అభ్యర్థి గెల్లు విజయానికి  పాటు పడవలసిన పార్టీ శ్రేణులు ఈటల గెలుపు కోసం పరోక్షంగా పనిచేసిండ్లని చెప్పవచు. దీనికి తోడు పలువురు ఎమ్మెల్యేలపై ఇక్కడ వచ్చిన లైంగిక ఆరోపణలు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా తయారయ్యాయి.

ఉద్యమం నుండి ఉన్న తమను కాదని ఇతర పార్టీలనుండి వచ్చిన వాళ్ళకు పట్టంకట్టడాన్ని స్థానికులు  జీర్ణించుకోలేకపోయారు. ఆ తరువాత ఎమ్మెల్సిగా గవర్నర్‌ ‌కోటానుండి కౌశిక్‌రెడ్డి పేరును పంపడాన్ని వాళ్లు భరించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇచ్చిన ఎస్‌.‌సి. కార్సోరేషన్‌, ‌బి.సి. కార్పోరేషన్‌ ‌చైర్మెన్ల పదవులను ఏమాత్రం ప్రబావం చూపని వ్యక్తులకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్‌లో జోష్‌ ‌తేలేకపోయింది. ఈ రెండు కార్పోరేషన్ల చైర్మెన్లు కూడ ఎన్నికలను పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోతున్నారు. ఎంతో ఉత్కంఠతను కలిగించిన ఈ ఉప ఎన్నికలలో వోటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకున్నారు. చైతన్యానికి మారుపేరైన వోటర్లు అందుకనుగుణంగానే తీర్పిచ్చారు.

దళితబందును విశ్వసించని  దళితులు
దళితబందును దళితులు పట్టించుకోలేదు. ఒక్కో అర్హుడికి 10 లక్షల పూర్తి సబ్సిడిని 17,500 మంది ఖాతాల్లో జమచేసి బ్యాంకు పాస్‌ ‌బుక్కులు ఇచ్చినా కూడ వారు విస్వసించలేదు, దళితులను మరోమారు దగాచేసే పథకమని వైరి వర్గాలు చేసిన ప్రచారాన్నే దళితులు నమ్మారు.  ప్రతిపక్షాల  ప్రచారాన్ని తిప్పికొట్టడంతో టి.ఆర్‌.ఎస్‌. ‌నాయకులు విఫలమయ్యారనే చెప్పవచ్చు వారి సందేహాలకు తోడు పథకాన్ని ప్రారంబించిన వెంటనే అమలు చేయడంలో కూడ తీవ్ర జాప్యాన్ని కనబర్చారు. పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టంలేదనే సంకేతాలు దళిత వాడల్లోకి బలంగా వెళ్ళాయి. దీంతో డోలాయమానానికి గురైన వాళ్ళు బి.జె.పి. వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. కనీసం దళితుల సందేహాలను నివృత్తి చేయాలని కూడ అధికార పార్టీ చూడలేదు. అందుకే అంత చేసి కూడ వారి వోట్లను పొందడంలో విఫలమయ్యారు. వోట్లు పొందడానికి వోటర్లకు టి.ఆర్‌.ఎస్‌. ‌చేసిన ఆరువేల పంపకాలు కూడ తీవ్ర వివాదస్పదమయ్యాయి. ఆరు -కారు – సారు – మల్ల రారు అని బి.జె.పి., కాంగ్రెస్  ‌పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. వోటర్ల కోసం పార్టీ ఇచ్చిన నిధులను వోటర్లందరికి చేరకపోవడంతో ఇది కూడ విమర్శలపాలైంది. పై నుంచి కిందికి ఎంతో పగడ్బందిగా నెట్‌వర్క్‌ను పెట్టి వంద మందికి ఒక్కరు ఇంచార్జిగా పెట్టి కూడ పంపకాలను సక్రమంగా చేయకపోవడంతో పోలింగ్‌ ‌నాటికి ఈ వ్యవహారం ప్రజల్లో తీవ్ర అసహనాన్ని, గందరగోళ పరిస్థితులకు దారితీసింది.

60 శాతం మందికి ఇచ్చి మిగత వాళ్ళకు ఇవ్వకపోడంతో డబ్బులు రానివాళ్ళు రోడ్డెక్కి లొల్లి  చేయగా వచ్చిన వాళ్ళు గుంభనంగా ఉన్నారు.  రాని వాళ్ళు స్థానిక నాయకుల చుట్టు ప్రదక్షిణలు చేయడం అప్పటికే బయటి వాళ్ళు అందినకాడికి అందినట్టు లోపలేసుకొని వెళ్లగా స్థానిక నాయకులు ఇదే అదునుగా రెండో దఫా వచ్చిన డబ్బులను స్థానికేతరులకోసం పంపిన డబ్బును పంచలేదు. దాంతో డబ్బుకోసం విసిగి వేసారి ప్రజలు కసితో, కోపంతో బి.జె.పి. వైపు మొగ్గు చూపారని తెలుస్తున్నది. వోటుకు నోటు కావాలనే డిమండ్‌ ‌మొట్ట మొదటిసారి  హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలో ప్రజలనుండి రావడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మొదటిసారి ఈ విదానాలను నిషితంగా ప్రజాస్వామిక వాదులు ఎంతో ఆందోళనరె విస్మయాన్ని వ్యక్తం చేశారు, డబ్బుల పంపకం వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బి.జే.పి అభ్యర్తి కూడ చేయవలసిన పనులన్నీ చేసినా ఎక్కువ నష్టం కలిగింది టి.ఆర్‌.ఎస్‌. అభ్యర్తి గెల్లు శ్రీనివాస్‌కే, ఎన్నికలకు ముందు ఈటల వైపు వెళ్ల కుండా పార్టీలో నే ఉండడానికి పెద్ద ఎత్తున లక్షలు లక్షలు డబ్బులు పొందిన స్థానిక టి.ఆర్‌.ఎస్‌. ‌నాయకులకు వోటర్ల రూపంలో కూడ కలిసిరావడం డబుల్‌ ‌ధమాకా కొట్టినట్లైంది.  పోలింగ్‌ ‌రోజు ఈ నాయకులంతా డబ్బుల గోల లో పడి పత్తా లేకుండా పోయారు. పోలింగ్‌ ‌సరళిని గమనిస్తూ తమ అభ్యర్తి గెలుపుకు పాటు పడాల్సిన నాయకులు డబ్బుల పంపకంలో పడిపోయి, ఆ విషయాన్నే మరిచిపోయారు.

ప్రభావం చూపిన సోషల్‌ ‌మీడియా
ఎన్నికల ప్రక్రియ మొదలు కావడానికి ముందే సోషల్‌ ‌మీడియా ప్రచారాన్ని బి.జె.పి. విస్తృతపర్చింది, సొంత చానళ్లు , ప్రింట్‌ & ఎలక్ట్రానిక్‌ ‌మీడియా సంస్థలు కలిగిన టి.ఆర్‌.ఎస్‌. ‌బి.జె.పి. చేసే సోషల్‌ ‌మీడియా ప్రచారం ముందు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇలా అనేక లోటుపాట్లను ఆ పార్టీ ఏమాత్రం గుర్తించకపోవడంతో ఈ దుస్థితి వచ్చిందని చెప్పవచ్చు – ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కాకుండ సాదాసీదాగా తీసుకొని ఉంటే కూడ ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. సోషల్‌ ఇం‌జనీరింగ్‌లో దిట్ట అయిన కె.సి.ఆర్‌. ఈ ‌వైపల్యం నుండి పార్టీని ఎలా బయటవేస్తారో.. ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి, దీనికి ప్రదాన్యత లేకుండా చేయడానికి ఇంకేం పన్నాగాలు పన్నుతారో వేచి చూడాల్పిందే…

– పబ్బు శ్రీనివాస్‌
‌సీనియర్‌ ‌జర్నలిస్టు

Leave a Reply