Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్యేపదవికి, టిఆర్‌ఎస్‌కు.. ఈటెల రాజీనామా..!

  • ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ చేస్తారా?
  • అది ప్రగతిభవన్‌ ‌కాదు.. బానిస భవన్‌
  • ఆకలినైనా భరిస్తాం.. ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోం
  • సింగరేణి సంఘంలో కవితకు ఏం పని
  •  ..బి ఫామ్‌ ఇస్తే కవిత ఓడిపోలేదా..?
  • ఉద్యామన్ని నమ్ముకుని వచ్చాం..
  • పదవులు ఉద్యమంతోనే వచ్చాయి
  • మీడియా సమావేశంలో ఈటల రాజేందర్‌

19 ఏళ్ల ఉద్యమ పార్టీతో ఈటెల రాజేందర్‌ ‌సంబంధాలను వదులకున్నారు. గులాబీ బాస్‌తో పెరిగిన అంతరం కారణంగా ఆయన ఇక ఆ పార్టీలో కొనసాగనని తేల్చేశారు. అర్థంతరంగా, వివరాలు కోరకుండానే తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆగ్రహం చెందిన ఈటెల రాజేందర్‌ ఎట్టకేలకు శుక్రవారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాత్రికి రాత్రే తానను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేశారని.. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఓ అనామకుడు లేఖ రాస్తే ఆగమేఘాల మీద మంత్రి మీద విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కనీసం తాన వివరణ కూడా అడగలేదన్నారు. హుజురాబాద్‌లో ఏ ఎన్నిక జరిగినా పార్టీని గెలిపించుకున్నాం. ప్రాణం ఉండగానే నన్ను బొందపెట్టాలని ఆదేశాలిచ్చారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హుజూరాబాద్‌ ‌ప్రజలు చెప్పారు. పదవుల కోసం నేను ఏనాడూ పాకులాడలేదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు రాజీనామా చేశానని ఈటల రాజేందర్‌ అన్నారు. అది ప్రగతిభవన్‌ ‌కాదు.. బానిస భవన్‌’ అం‌టూ ఈటల విమర్శలు గుప్పించారు. సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌ ఒక్కరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. రూ.వందల కోట్లు ఇన్‌కంట్యాక్స్ ‌కట్టేవారికి రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. హరీష్‌రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆకలినైనా భరిస్తాం.. ఆత్మ గౌరవాన్ని వదులుకోమన్నారు. కేసీఆర్‌ ‌హయాంలో మంత్రులకు , అధికారులకు స్వేచ్ఛ లేదని ఈటల అన్నారు.

ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ కూడా తనతోపాటే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఈటల తెలిపారు. జరిగిన అవమానంతో  19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌ ‌శివారు శావి•ర్‌పేట నివాసంలో నిర్వహించిన వి•డియా సమావేశంలో రాజేందర్‌ ‌మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నోసార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. తెరాస నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు.

పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం వి•ద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్‌ ‌ప్రజలు గెలిపించారు. అప్పుడు కేసీఆర్‌ ‌ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారు. కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్‌ ‌కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. ఆర్థిక శాఖ అధికారులతో సవి•క్షలో ఆర్థికమంత్రి ఉండరు.

దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదు. నల్గొండ, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఈటల వ్యాఖ్యానించారు.  టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో తనతో పాటు మంత్రి హరీష్‌రావు సైతం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. సంక్షేమ పథకాలను ఏనాడు వ్యతిరేకించలేదు. వందల కోట్లు ఇన్కమ్‌ ‌టాక్స్ ‌కట్టేవాళ్లకు రైతు బంధు ఇవ్వొద్దని చెప్పిన. అది చెప్పడం తప్పేలా అవుతుంది? బెంజ్‌ ‌కార్లలో తిరిగేవాళ్లకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. నయీం లాంటి వ్యక్తులు చంపుతానని బెదిరించినా తెలంగాణ జెండా వదలలే. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు నన్ను కలిస్తే అవహేళన చేశారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిసంఘం నేను పెట్టిస్తే దాన్ని ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ‌కూతురు కవిత నడుపుతోంది. అందులో కవితకు ఏం పనని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మిక సంఘాన్ని నేను, హరీష్‌ ‌రావు పెట్టిస్తే.. కవితకు అప్పగిస్తున్నారు. ఏ సంఘానికీ ఈ రోజు హక్కులు లేవు. ధర్నా చౌక్‌ ‌కూడా లేదు. ఇవి మేము అడుగొద్దా? పెన్షన్‌లు సీఎంకు చెప్పి ఇప్పిస్తా అని చెప్పడం తప్పా? ఐకేపీ సెంటర్లు ఉంటాయ్‌.. ‌ధాన్యం కొంటాయ్‌ అని చెప్పడం తప్పా? రోశంగల బిడ్డను కాబట్టే ఆనాడు టీఆర్‌ఎస్‌లో చేరినా. మంత్రి పదవి ఇచ్చి బానిస బతుకు బతకమంటే సాధ్యమా? నీవు లల్లు, మాయావతిలాగా పెట్టిన పార్టీ కాదు. వందల మంది బలిదానం చేస్తే రాష్ట్రం వచ్చింది. అందర్‌ ‌వాలే బాహర్‌, ‌బాహర్‌ ‌వాలే అందర్‌ అన్నట్లుగా ఉందని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’నిన్ను చంపుతా అన్న వారు వచ్చి వి• పక్కన కూర్చున్నారు.

నాకు మస్క కొడితే పదవి ఇవ్వలేదు. ఆలె నరేంద్ర, విజయశాంతిని నాలానే పంపించారు. మంత్రులకు, అధికారులకు స్వేచ్ఛ లేదు. నక్సలైట్‌ అజెండా అని చెప్పిన వి•రు వరవరరావును జైల్‌లో పెడితే ఎందుకు మాట్లాడలేదు? మంత్రుల వి•దే నమ్మకం లేకపోతే నాలుగు కోట్ల ప్రజలను అడిగే హక్కు ఎక్కడిది? అప్పటి ఒక దళిత ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌ ‌నగర్‌ ఆయనది.. సహాయం అడిగితే చేయొద్దని ఆదేశించారు. ఆ దళిత మాజీ ఎమ్మెల్యే ఎవరో కూడా ఎప్పుడు చెప్పమన్నా చెప్పేందుకు నేను సిద్ధం అని ఈటల పేర్కొన్నారు. హుజురాబాద్‌ ‌ప్రజలు కుట్రలు చేదిస్తాం అంటున్నారు. నాకు పదవి ఇవ్వలేదని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇజ్జత్‌ ‌తక్కువ బతుకు వద్దని నా ప్రజలు చెబుతున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.

తన సొంత కూతురుకు బీ ఫామ్‌ ఇచ్చినా ఓడింది. బీ ఫారం ఇస్తే నేను ఎప్పుడూ ఓడకుండా గెలిచినా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తనకు వచ్చిన గ్యాప్‌ ఇవాళ రాలేదని.. ఐదేళ్ల క్రితమే వచ్చిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్‌ ‌జిల్లాకు ఉంది. కేసీఆర్‌ ‌కుట్రలు, డబ్బు, అణిచివేతను నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు.. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరు. ఉప ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవచ్చు.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం వెళితే గేట్‌ ‌దగ్గరే ఆపేశారు. రెండో సారి అపాయింట్‌ ‌మెంట్‌ ‌తీసుకుని పోయాం. రెండోసారి కూడా గేట్ల నుంచే బయటకు పంపించారు. మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్‌ను అడిగాను.

అది ప్రగతి భవన్‌ ‌కాదు.. బానిస భవన్‌ అని పేరు పెట్టుకోవాలని చెప్పా. వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు కావాలి.. ఇప్పుడు సంఘాలు వద్దా? బొగ్గు గనులతో సంబంధం లేని వ్యక్తులు ఆ సంఘాన్ని నడుపుతున్నారని విమర్శించారు. ఈటెల మాట్లాడుతున్నంత సేపు వందలాదిగా వచ్చిన అభిమానులు, నాయకులు ఆయన వెన్నంటి ఉన్నారు.

Leave a Reply